IND vs AUS: టీ20ల్లో హిట్.. వన్డేల్లో ఫట్.. 15 మ్యాచ్‌‌ల్లో అట్టర్ ఫ్లాప్.. సూర్య ‘గ్రహణం’ వీడకుంటే, చోటు కష్టమే?

|

Mar 18, 2023 | 12:35 PM

Surya Kumar Yadav: సూర్యకుమార్ యాదవ్ బ్యాట్ వన్డే ఫార్మాట్‌లో వరుసగా ఫ్లాప్ అవుతున్నాడు. టీ20 ఫార్మాట్‌కు విరుద్ధంగా ముందుకు వెళ్తున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలోనూ అదే కనిపించింది.

IND vs AUS: టీ20ల్లో హిట్.. వన్డేల్లో ఫట్.. 15 మ్యాచ్‌‌ల్లో అట్టర్ ఫ్లాప్.. సూర్య గ్రహణం వీడకుంటే, చోటు కష్టమే?
Suryakumar Yadav
Follow us on

ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌ను భారత జట్టు విజయంతో ప్రారంభించింది. సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా మిస్టర్ 360 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ కూడా భాగస్వామ్యం అయ్యాడు. కానీ, ఘోరంగా ఫ్లాప్ అయ్యాడు. వన్డే ఫార్మాట్‌లో సూర్య ఫ్లాప్ షో ఈ సిరీస్‌లోనూ కొనసాగింది.

శ్రేయాస్ అయ్యర్ గాయం కారణంగా తప్పుకోగా, సూర్యకుమార్ ముంబై వన్డేకు ఎంపికయ్యాడు. సూర్య బ్యాటింగ్‌కు వచ్చేసరికి జట్టు స్కోరు 14 పరుగుల వద్ద రెండు వికెట్లు కోల్పోయింది. కోహ్లీ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్య తొలి బంతికే ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యాడు. సూర్య ఒక్క బంతిని కూడా ఎదుర్కోలేక గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు.

సూర్య వన్డేల్లో అరంగేట్రం చేసిన తర్వాత కొన్ని మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు. కానీ, ఆ తర్వాత అతని లయ క్షీణించింది. ఈ ఫార్మెట్‌లో ఇప్పటి వరకు ఈ తుఫాన్ బ్యాట్స్‌మెన్ ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయాడు. 21 మ్యాచ్‌ల్లో 19 ఇన్నింగ్స్‌ల్లో 27.06 సగటుతో 433 పరుగులు చేశాడు. అతని బ్యాట్ నుంచి కేవలం రెండు అర్ధ సెంచరీలు మాత్రమే వచ్చాయి.

ఇవి కూడా చదవండి

గత 11 ఇన్నింగ్స్‌ల గురించి చెప్పాలంటే, సూర్య కేవలం నాలుగు సార్లు మాత్రమే రెండంకెలను తాకగలిగాడు. అదే సమయంలో సూర్య బ్యాట్ నుంచి గత 15 ఇన్నింగ్స్‌లలో అర్ధ సెంచరీ రాలేదు. టీ20లో అతని ఫామ్ అందుకు విరుద్ధంగా ఉంది. గతేడాది ఈ ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

ఒకవేళ సూర్య ఈ ఫార్మాట్‌లో తన స్థానాన్ని నిర్ధారించుకోవలసి వస్తే, భారీ ఇన్నింగ్స్‌లు తప్పక ఆడాల్సిందే. అవకాశం వచ్చినప్పుడు తనను తాను నిరూపించుకోవాలి. శ్రేయాస్ అయ్యర్ లాంటి ఆటగాడి స్థానంలో బరిలోకి దిగుతున్నందున మంచి ఇన్నింగ్స్‌లు ఆడితేనే జట్టులో చోటు దక్కించుకునే ఛాన్స్ ఉంది. ఇక సూర్య రీసెంట్ ఫామ్ చూస్తుంటే అవకాశాలు తగ్గే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..