IND vs AUS: మెల్‌బోర్న్‌లో భారత్, ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్ రద్దు.. క్రికెట్ ఆస్ట్రేలియా షాకింగ్ నిర్ణయం..
India vs Australia ODI: వచ్చే ఏడాది భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లోని రెండవ మ్యాచ్‌ను మెల్‌బోర్న్‌కు బదులుగా హోబర్ట్‌కు మార్చారు. దీనికి గల కారణం వింటే కచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..

IND vs AUS: రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత వన్డే జట్టు వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. అలాగే భారత మహిళా జట్టు ఆస్ట్రేలియాలో వన్డేలు, టీ20లు, టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను కూడా ఆడనుంది. కానీ, ఈ పర్యటన ఈ సంవత్సరం కాదు, వచ్చే సంవత్సరం జరుగుతుంది. దీని కోసం క్రికెట్ ఆస్ట్రేలియా ఓ కీలక అడుగు వేసింది. దీని కారణంగా వచ్చే ఏడాది మెల్‌బోర్న్‌లోని జంక్షన్ ఓవల్‌లో జరగాల్సిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లోని రెండవ మ్యాచ్‌ను ఇప్పుడు హోబర్ట్‌కు మార్చారు. దీని వెనుక ఉన్న కారణం కూడా వెలుగులోకి వచ్చింది.
ఫ్లడ్ లైట్స్ లేని కారణంగా..
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మహిళా జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో రెండవ మ్యాచ్ మెల్‌బోర్న్‌లోని జంక్షన్ ఓవల్ మైదానంలో జరగాల్సి ఉంది. కానీ, అప్పటికి ఈ మైదానంలో కొత్త ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేయరు. దీని కారణంగా క్రికెట్ ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌ను హోబర్ట్‌కు మార్చింది. క్రికెట్ ఆస్ట్రేలియా క్రికెట్ ఆపరేషన్స్ హెడ్ పీటర్ రోచ్ మాట్లాడుతూ, ఈ మ్యాచ్‌ను జంక్షన్ ఓవల్ నుంచి తరలించాల్సి రావడం, ఈ సీజన్‌లో మెల్‌బోర్న్‌లో మహిళల అంతర్జాతీయ మ్యాచ్‌లు జరగకపోవడం మాకు నిరాశ కలిగించింది. ఈ మ్యాచ్‌కు చాలా వారాల ముందే జంక్షన్ ఓవల్‌లోని లైట్లు ఏర్పాటు చేస్తారని మేమందరం ఊహించాం. మైదానంలో లైట్ల వెలుగులో మొదటి అంతర్జాతీయ మ్యాచ్‌ను నిర్వహించాలని ఎదురు చూస్తున్నాం. కానీ అది ఇకపై సాధ్యం కాదు’ అని తెలిపాడు.
ప్రపంచ కప్ పైనే దృష్టి..
2026లో భారత మహిళా జట్టు ఆస్ట్రేలియా పర్యటన గురించి మాట్లాడుకుంటే, ఇది మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆడుతుంది. ఆ తర్వాత మూడు మ్యాచ్‌ల ODI సిరీస్, తరువాత ఒకే టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది. ఈ పర్యటనలో మొదటి టీ20 మ్యాచ్ ఫిబ్రవరి 15న జరుగుతుంది. చివరి టెస్ట్ మ్యాచ్ మార్చి 6న జరుగుతుంది. కానీ, దీనికి ముందు, భారత మహిళా జట్టు స్వదేశంలో జరిగే 2025 వన్డే ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకోవాలని కోరుకుంటుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




