Nitish Kumar Reddy Reacts on Baahubali Style Celebrations: ప్రతిష్టాత్మక మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నాలుగో టెస్టు మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్ యువ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి చిరస్మరణీయ ప్రదర్శనతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఎనిమిదో నంబర్‌లో బ్యాటింగ్‌కు దిగిన నితీష్ కుమార్ రెడ్డి అద్భుతమైన సెంచరీ సాధించి, టీమిండియాను ఫాలో ఆన్ ప్రమాదం నుంచి గట్టెక్కించాడు. అయితే అర్ధ సెంచరీ సమయంలో “పుష్ప” శైలిలో సెలబ్రేషన్స్ చేసిన నితీష్ రెడ్డి.. సెంచరీ తర్వాత “బాహుబలి” స్టైల్లో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. దీంతో నితీస్ రెడ్డి వేడుకలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
తన తొలి టెస్ట్ సెంచరీ తర్వాత భావోద్వేగం చెందిన నితీష్ కుమార్ రెడ్డి.. మీడియాతో మాట్లాడాడు. “నేను మా నాన్న కన్నీళ్లను చూశాను. అతన్ని గర్వపడేలా చేయాలనేది నా కల” అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే, బాహుబలి తరహాలో సెలబ్రేషన్స్‌పై మాట్లాడుతూ, “సెంచరీ పూర్తి చేసిన తర్వాత, నేను నా బ్యాట్‌ను నేలపై నిటారుగా ఉంచి, దానిపై నా హెల్మెట్‌ను ఉంచాను. హెల్మెట్‌పై జాతీయ జెండా ఉంది. నా దేశానికి నివాళిగా నేను సెల్యూట్ చేశాను. దేశానికి ప్రాతినిధ్యం వహించడం గొప్పగా అనిపిస్తోంది. ఈ శతాబ్దం తన జీవితంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన క్షణాలలో ఒకటిగా మిగిలిపోతుంది’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.
సెంచరీకి అవసరమైన చివరి పరుగును సాధించడంలో కీలక పాత్ర పోషించిన హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్‌పైనా ప్రశంసలు కురిపించాడు. నా నమ్మకాన్ని మరో స్థాయికి సిరాజ్ తీసుకెళ్లాడు. ఆయన మద్దతుకు నేను కృతజ్ఞుడను’ అంటూ నితీష్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చాడు
కాగా, నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ ప్రయాణంలో ఎంతో నాటకీయత చోటు చేసుకుంది. వ్యక్తిగత స్కోరు 99 లోపు వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా త్వరితగతిన ఔట్ అయ్యారు. నితీష్ రెడ్డి ఈ మైలురాయిని సాధిస్తాడా లేదా అనే ఉత్కంఠ పెరిగింది. చివరి ప్లేయర్‌గా మైదానంలోకి అడుగుపెట్టిన మహ్మద్ సిరాజ్ మూడు బంతులను జాగ్రత్తగా కాపాడుకుంటూ నితీష్ కుమార్ రెడ్డికి స్ట్రైక్ ఇచ్చాడు. చేతిలో ఉన్న అవకాశంతో, నితీష్ కుమార్ రెడ్డి తన సెంచరీని పూర్తి చేసే సమయం రానే వచ్చింది. అద్భుతమైన బౌండరీతో తన కెరీర్‌లోనే తొలి సెంచరీ, అది కూడా భారత జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు రావడం మరిచిపోలేని క్షణాలు మార్చుకున్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..