IND Vs AUS: ఆసీస్‌తో మూడో వన్డే.. జట్టులో కీలక మార్పు.. బరిలోకి టీ20 ఫినిషర్.. ప్లేయింగ్ XI ఇదే.!

విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియాపై ఘోర పరాజయాన్ని చవి చూసింది టీమిండియా. దీంతో పర్యాటక జట్టు..

IND Vs AUS: ఆసీస్‌తో మూడో వన్డే.. జట్టులో కీలక మార్పు.. బరిలోకి టీ20 ఫినిషర్.. ప్లేయింగ్ XI ఇదే.!
Ind Vs Aus
Follow us

|

Updated on: Mar 21, 2023 | 3:40 PM

విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియాపై ఘోర పరాజయాన్ని చవి చూసింది టీమిండియా. దీంతో పర్యాటక జట్టు మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేయగా.. మార్చి 22వ తేదీన చెన్నై వేదికగా జరగబోయే ఆఖరి వన్డే రెండు జట్లకు కీలకంగా మారనుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించి సిరీస్ దక్కించుకోవాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి.

ఇక డిసైడర్ మ్యాచ్‌లో రెండు కీలక మార్పులతో టీమిండియా బరిలోకి దిగే అవకాశం ఉంది. వెటరన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ స్థానంలో వాషింగ్టన్ సుందర్‌కు ఛాన్స్ ఇవ్వాలని భావిస్తోందట టీమ్ మేనేజ్‌మెంట్. తొలి రెండు వన్డేలకు బెంచ్‌కే పరిమితమైన సుందర్‌ను.. తన హోం గ్రౌండ్ చెపాక్‌లో ఆడించాలని రోహిత్ శర్మ, అండ్ టీమ్ మేనేజ్‌మెంట్.

అలాగే రెండు వన్డేలలోనూ గోల్డన్ డక్‌గా వెనుదిరిగిన స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్‌కు మరో అవకాశం ఇవ్వాలని జట్టు మేనేజ్‌మెంట్ చూస్తోందట. అలా కాదని తప్పిస్తే.. ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ వచ్చే ఛాన్స్ ఉంది. అటు ఆస్ట్రేలియా విషయానికొస్తే.. రెండో వన్డేలో బరిలోకి దిగే జట్టుతోనే.. మూడో వన్డేలోనూ కొనసాగించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

భారత్(అంచనా)

రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మాన్ గిల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్/ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా(వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ షమీ, సిరాజ్

ఆస్ట్రేలియా(అంచనా):

ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబూషేన్, కామెరాన్ గ్రీన్, మార్కస్ స్టోయినిస్, అలెక్స్ కారీ, సీన్ అబాట్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్

సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..