AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: టీమిండియా శ్రీలంక టూర్ ముగిసింది.. తర్వాత భారత జట్టు ఆడబోయే మ్యాచ్‌లు ఇవే

Team India: శ్రీలంకతో టెస్టు సిరీస్‌ను 1-0తో గెలుచుకుని భారత క్రికెట్ జట్టు స్వదేశానికి చేరుకుంది. ఆఖరి మ్యాచ్ డ్రా కావడంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పట్టికలో ఐదో స్థానంలోనే నిలిచిన టీమిండియా, ఇప్పుడు సెప్టెంబర్‌లో వరుస సిరీస్‌లతో బిజీ కానుంది. తదుపరి మ్యాచ్ ఎప్పుడు, ఎవరితో ఉందో పూర్తి షెడ్యూల్ చూద్దాం.

Team India: టీమిండియా శ్రీలంక టూర్ ముగిసింది.. తర్వాత భారత జట్టు ఆడబోయే మ్యాచ్‌లు ఇవే
India Vs Sa Test Series
Rakesh
|

Updated on: Aug 28, 2026 | 11:30 AM

Share

Team India: శ్రీలంకలో రెండు టెస్టుల సిరీస్‌ను భారత్ విజయవంతంగా ముగించింది. మొదటి మ్యాచ్‌ను గెలుచుకున్న గిల్ సేన, రెండో మ్యాచ్‌ను డ్రాగా ముగించాల్సి వచ్చింది. ఈ ఫలితం డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలపై కాస్త ప్రభావం చూపినప్పటికీ, స్వదేశానికి తిరిగొచ్చిన భారత్ తదుపరి సమరానికి సిద్ధమవుతోంది. సెప్టెంబర్ నెలలో భారత జట్టు ఏకంగా టీ20 సిరీస్, వన్డే సిరీస్ తో పాటు ఏషియన్ గేమ్స్ టోర్నమెంట్‌లోనూ పాల్గొనబోతోంది. సెప్టెంబర్ 13 నుంచి అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌కు అఫ్గానిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్నప్పటికీ, మ్యాచ్‌లు మాత్రం భారతదేశంలోని ఢిల్లీ (అరుణ్ జైట్లీ స్టేడియం)లోనే జరగడం విశేషం. సెప్టెంబర్ నెలలో భారత్ ఒకే సమయంలో అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్, వెస్టిండీస్ వన్డే సిరీస్, ఆసియా గేమ్స్ పోటీలలో పాల్గొననుంది.

అఫ్గానిస్థాన్ వర్సెస్ భారత్ టీ20 సిరీస్ షెడ్యూల్

ఈ సిరీస్‌లో మొత్తం 3 టీ20 మ్యాచ్‌లు జరుగుతాయి. మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7:00 గంటలకు ప్రారంభమవుతాయి.

మొదటి టీ20: సెప్టెంబర్ 13 (అరుణ్ జైట్లీ స్టేడియం, ఢిల్లీ)

రెండో టీ20: సెప్టెంబర్ 15 (అరుణ్ జైట్లీ స్టేడియం, ఢిల్లీ)

మూడో టీ20: సెప్టెంబర్ 17 (అరుణ్ జైట్లీ స్టేడియం, ఢిల్లీ)

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ వివరాలు

సెప్టెంబర్ చివరి వారంలో భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది.

మొదటి వన్డే: సెప్టెంబర్ 27 (గ్రీన్ ఫీల్డ్ స్టేడియం, తిరువనంతపురం)

రెండో వన్డే: సెప్టెంబర్ 30 (డాక్టర్ భూపేన్ హజారికా క్రికెట్ స్టేడియం, గువాహటి)

మూడో వన్డే: అక్టోబర్ 3 (పీసీఏ స్టేడియం, న్యూ ఛండీగఢ్)

ఆసియా గేమ్స్‌లో భారత క్రికెట్ జట్టు షెడ్యూల్

ఆసియా గేమ్స్‌లో భారత జట్టు నేరుగా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. సెప్టెంబర్ 28న కోరోగి స్పోర్ట్స్ పార్క్ (నిషిన్) వేదికగా భారత్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ బరిలోకి దిగుతుంది (ప్రత్యర్థి జట్టు ఇంకా ఖరారు కాలేదు). ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత జట్టు అక్టోబర్ 1న సెమీఫైనల్ పోరులో పాల్గొంటుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
రోజూ తెల్ల శనగలు తింటున్నారా?నెలరోజుల తర్వాత శరీరంలో జరిగే మార్పు
రోజూ తెల్ల శనగలు తింటున్నారా?నెలరోజుల తర్వాత శరీరంలో జరిగే మార్పు
మెంటలెక్కిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా.?
మెంటలెక్కిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా.?
తెలంగాణ వేదికగా ఖేలో ఇండియా గేమ్స్.. ఏ జిల్లాలో ఏ క్రీడలు
తెలంగాణ వేదికగా ఖేలో ఇండియా గేమ్స్.. ఏ జిల్లాలో ఏ క్రీడలు
అరెరె.. ఇంత తప్పు చేస్తున్నామా.. చికెన్ కడిగే ముందు ఈ నిజాలు
అరెరె.. ఇంత తప్పు చేస్తున్నామా.. చికెన్ కడిగే ముందు ఈ నిజాలు
అకాల మరణం పొందిన వారికి శ్రాద్ధం ఎప్పుడు చేయాలి? వివాహిత స్త్రీలు
అకాల మరణం పొందిన వారికి శ్రాద్ధం ఎప్పుడు చేయాలి? వివాహిత స్త్రీలు
హైదరాబాద్‌లో మరో భారీ ఫ్లైఓవర్.. 4 కిలోమీటర్ల మేర నిర్మాణం..
హైదరాబాద్‌లో మరో భారీ ఫ్లైఓవర్.. 4 కిలోమీటర్ల మేర నిర్మాణం..
ప్రభుత్వ అధికారుల కర్చీలపై తెలుపు వస్త్రం ఎందుకు ఉంటుందో తెలుసా?
ప్రభుత్వ అధికారుల కర్చీలపై తెలుపు వస్త్రం ఎందుకు ఉంటుందో తెలుసా?
త్రిగ్రాహి యోగంతో ఈ 3 రాశులకు గోల్డెన్ డేస్! మీ రాశి ఇదేనా?
త్రిగ్రాహి యోగంతో ఈ 3 రాశులకు గోల్డెన్ డేస్! మీ రాశి ఇదేనా?
డబ్బు సంపాదన గురించి చాణిక్యుడు చెప్పిన 3 సీక్రెట్స్!
డబ్బు సంపాదన గురించి చాణిక్యుడు చెప్పిన 3 సీక్రెట్స్!
ఈ బుడ్డోడిపై శ్రేయస్‌కు ఎందుకంత నమ్మకం?
ఈ బుడ్డోడిపై శ్రేయస్‌కు ఎందుకంత నమ్మకం?