
U19 Asia Cup : ప్రస్తుతం జరుగుతున్న అండర్ 19 ఆసియా కప్ 2025 టోర్నమెంట్‌లో భారత U19 జట్టు తమ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును మరింత మెరుగుపరుచుకుంది. ఇండియన్ U19 టీమ్ యూత్ వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్‌లో మూడవసారి 400 పరుగుల మైల్‌స్టోన్‌ను దాటింది. ఇప్పటికే రెండుసార్లు 400+ స్కోరు చేసి అగ్రస్థానంలో ఉన్న టీమిండియా ఇప్పుడు మూడోసారి ఈ ఘనత సాధించి తమ ప్రపంచ రికార్డును మరింత బలోపేతం చేసుకుంది.
డిసెంబర్ 12, శుక్రవారం నాడు భారత అండర్ 19 జట్టు యూఏఈ అండర్ 19 జట్టుతో జరిగిన ఏసీసీ మెన్స్ U19 ఆసియా కప్ 2025 లీగ్ మ్యాచ్‌లో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 433 పరుగులు చేసింది. ఈ స్కోరు అండర్ 19 ఆసియా కప్ చరిత్రలో అత్యధికం కాగా, యూత్ వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్‌లో మూడవ అతిపెద్ద స్కోరుగా నిలిచింది. అంతేకాదు, U19 వన్డే మ్యాచ్‌లో 400+ స్కోరు చేసిన జట్టుగా భారత్, మూడుసార్లు ఈ మైల్‌స్టోన్‌ను చేరుకుంది. భారత్‌తో పాటు మరో నాలుగు జట్లు ఈ ఘనత సాధించినప్పటికీ అవి ఒక్కొక్కసారి మాత్రమే ఈ రికార్డును నమోదు చేయగలిగాయి.
టీమిండియాతో పాటు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక, వెస్టిండీస్ జట్లు ఒక్కొక్కసారి U19 వన్డే క్రికెట్‌లో 400 పరుగుల మార్క్‌ను దాటాయి. భారత్ గతంలో 2004లో స్కాట్లాండ్‌పై 425 పరుగులు, 2022లో ఉగాండాపై 405 పరుగులు చేసి రెండుసార్లు ఈ మార్క్‌ను అందుకుంది. ప్రస్తుతం 433 పరుగుల మూడవ స్కోరుతో భారత జట్టు అగ్రస్థానాన్ని పదిలం చేసుకుంది.
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్ల జాబితాలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంది. 2002 సంవత్సరంలో ఆస్ట్రేలియా జట్టు కెన్యాపై భారీగా 480 పరుగులు చేసి ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఇది ఇప్పటికీ వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోరుగా నిలిచింది. ఈ రికార్డుకు దగ్గరగా వచ్చిన మరో జట్టు న్యూజిలాండ్. కివీస్ జట్టు 2018 సంవత్సరంలో కెన్యాపై 436 పరుగులు చేసి, ఈ జాబితాలో రెండవ స్థానంలో నిలిచింది. ఇక మూడవ స్థానంలో టీమిండియా ఉంది. మన భారత జట్టు యూఏఈ పై 433 పరుగులు చేసి అత్యధిక స్కోరు సాధించిన జాబితాలో మూడవ స్థానాన్ని దక్కించుకుంది. ఈ రికార్డులు అంతర్జాతీయ క్రికెట్‌లో జట్ల బ్యాటింగ్ పవర్ ఎంత శక్తివంతమైనదో చాటి చెబుతున్నాయి.
గతంలో 425 పరుగులతో భారత్ మూడో స్థానంలో ఉన్నప్పటికీ, ఇప్పుడు 433 పరుగులు చేసి ఆ స్థానాన్ని మరింత మెరుగుపరుచుకుంది. ఐదో స్థానంలో శ్రీలంక (419 పరుగులు) ఉంది. ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశితో పాటు మరో బ్యాట్స్‌మన్ వేగంగా ఆడి ఉంటే, టీమిండియా అతిపెద్ద స్కోరు చేసిన ప్రపంచ రికార్డును కూడా తమ పేరున లిఖించుకునే అవకాశం ఉండేది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ చూడండి