IND vs SA: 2వ టెస్ట్‌కు రంగం సిద్ధం.. టీమిండియా ప్లేయింగ్ 11పై ఉత్కంఠ.. ఆ ఇద్దరిపైనే చూపంతా..

|

Jan 02, 2024 | 8:35 PM

IND vs SA 2nd Test: కేప్ టౌన్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం 2 టెస్టుల సిరీస్‌లో భారత జట్టు 1-0తో వెనుకంజలో ఉంది. కేప్ టౌన్ పిచ్ దాని వేగవంతమైన పేస్, బౌన్స్‌కు ప్రసిద్ధి చెందింది. అదే సమయంలో, ఈ పిచ్‌కు సంబంధించిన అనేక ఫొటోలు వెలుగులోకి వచ్చాయి.

IND vs SA: 2వ టెస్ట్‌కు రంగం సిద్ధం.. టీమిండియా ప్లేయింగ్ 11పై ఉత్కంఠ.. ఆ ఇద్దరిపైనే చూపంతా..
Ind Vs Sa 2nd Test Playing
Follow us on

IND vs SA Pitch Report, Playing 11, Live Streaming: భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య రెండవ టెస్ట్ జనవరి 3 నుంచి జరుగుతుంది. కేప్ టౌన్ వేదికగా ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం 2 టెస్టుల సిరీస్‌లో భారత జట్టు 1-0తో వెనుకంజలో ఉంది. తొలి టెస్టులో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో టీమిండియాను ఓడించింది. అయితే, సిరీస్‌ను సమం చేయాలనే ఉద్దేశంతో భారత జట్టు కేప్ టౌన్ లో అడుగుపెట్టనుంది. అయితే, దక్షిణాఫ్రికా జట్టు సిరీస్ గెలవాలని కోరుకుంటోంది.

కేప్ టౌన్ పిచ్ ఎలా ఉంటుంది?

కేప్ టౌన్ పిచ్ దాని వేగవంతమైన పేస్, బౌన్స్‌కు ప్రసిద్ధి చెందింది. అదే సమయంలో, ఈ పిచ్‌కు సంబంధించిన అనేక ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. పిచ్‌పై పచ్చగడ్డి వేసినట్లు ఈ చిత్రంలో స్పష్టంగా చూడొచ్చు. అంటే, ఫాస్ట్ బౌలర్లకు సహాయం ఉంటుంది. అదే సమయంలో బ్యాట్స్‌మెన్‌కు సవాల్‌ పెరుగుతుంది. టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ చేయగలదని నమ్ముతున్నారు. కొత్త బంతి ప్రారంభ ఓవర్లలో ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. అయితే, మ్యాచ్ సాగుతున్న కొద్దీ బ్యాటింగ్ సులువైనప్పటికీ ఫాస్ట్ బౌలర్లకు పిచ్ మంచి మద్దతునిస్తుంది.

ఎప్పుడు, ఎక్కడ, ఎలా ప్రత్యక్షంగా చూడాలి?

భారత్-దక్షిణాఫ్రికా మధ్య కేప్ టౌన్ టెస్టు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో భారతీయ అభిమానులు ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించగలరు. అదే సమయంలో, క్రికెట్ అభిమానులు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారాన్ని ఆస్వాదించగలరు. అయితే, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో మ్యాచ్ చూడటానికి, అభిమానులు చందా తీసుకోవాల్సి, అంటే డబ్బులు చెల్లించాలి.

టీమిండియా ప్రాబబుల్ ప్లేయింగ్ 11..

రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, ముఖేష్ కుమార్.

దక్షిణాఫ్రికా ప్రాబబుల్ ప్లేయింగ్ 11..

టోనీ డి జోర్జి, డీన్ ఎల్గర్ (కెప్టెన్), ఐడెన్ మార్క్‌రామ్, కీగన్ పీటర్సన్, డేవిడ్ బెడింగ్‌హామ్, వియాన్ ముల్డర్, కైల్ వెర్రేన్నే (కీపర్), మార్కో జాన్సెన్, కగిసో రబడా, గెరాల్డ్ కోయెట్జీ, నాండ్రే బెర్గర్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..