IND vs WI: గంభీర్ జర జాగ్రత్త.. ఈ పొరపాటు రిపీటైతే.. సెమీస్ చేరకుండానే ఇంటికి..?

IND vs WI: టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ జట్టు మార్చి 1న తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఇరుజట్లకు ఎంతో కీలకంగా మారింది. ఎందుకంటే గెలిచిన టీం సెమీస్ చేరుకుంటుంది. ఓడిన జట్టు సెమీస్ రేసు నుంచి తప్పుకుంటుంది. దీంతో ఇప్పుడు అందరి ఆసక్తి ఈ మ్యాచ్‌పైనే నిలిచింది.

IND vs WI: గంభీర్ జర జాగ్రత్త.. ఈ పొరపాటు రిపీటైతే.. సెమీస్ చేరకుండానే ఇంటికి..?
Team India

Updated on: Feb 27, 2026 | 1:20 PM

IND vs WI: టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశలో జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్ సెమీఫైనల్ రేసులో మళ్లీ దూసుకొచ్చింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత్ 72 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 256 పరుగులు చేసి టోర్నీలో ఇప్పటివరకు అత్యధిక స్కోర్ నమోదు చేసింది. ప్రతిగా జింబాబ్వేను 184 పరుగులకే పరిమితం చేసింది.

ఈ విజయం తర్వాత భారత్‌కు సెమీఫైనల్ చేరే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఒక్క చిన్న తప్పిదం కూడా టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదాన్ని తెస్తుంది. ముఖ్యంగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లో సూర్యకుమార్ బౌలింగ్ యూనిట్ ను సక్రమంగా వాడుకోవడంలో విఫలమయ్యాడు. దుబేను వాడుకోవడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. కేవలం 2 ఓవర్లతో మ్యాచ్ పరిస్థితి మారిపోతుంది.

భారత్ సెమీఫైనల్‌కు ఎలా చేరుతుంది?

గ్రూప్-1 నుంచి దక్షిణాఫ్రికా ఇప్పటికే సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. ఇప్పుడు రెండో స్థానం కోసం భారత్, వెస్టిండీస్ మధ్య పోటీ నెలకొంది. మార్చి 1న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ రెండు జట్లు తలపడనున్నాయి.

ఇవి కూడా చదవండి

భారత్‌కు ఇప్పుడు ఒకే ఒక్క మార్గం ఉంది. వెస్టిండీస్‌పై తప్పక గెలవాలి. ఏ తేడాతోనైనా విజయం సాధిస్తే భారత్ 4 పాయింట్లతో గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచి సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.

వెస్టిండీస్‌కు కూడా ఇదే పరిస్థితి. రెండు మ్యాచ్‌ల తర్వాత ఆ జట్టు ఖాతాలో కూడా 2 పాయింట్లే ఉన్నాయి. కాబట్టి ఈ మ్యాచ్ క్వార్టర్ ఫైనల్ లాంటి పోరుగా మారింది. గెలిచిన జట్టు సెమీఫైనల్ టికెట్ దక్కించుకుంటుంది.

టీ20 వరల్డ్ కప్ చరిత్రలో భారత్ vs వెస్టిండీస్..

టీ20 వరల్డ్ కప్ చరిత్రలో భారత్, వెస్టిండీస్ మధ్య ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో వెస్టిండీస్ 3 మ్యాచ్‌లు గెలిచింది. భారత్ ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది.

భారత్ వెస్టిండీస్‌పై సాధించిన ఏకైక విజయం 2014లో నమోదైంది. 2016లో జరిగిన చివరి ఎదురెదురులో సెమీఫైనల్ మ్యాచ్‌లో వెస్టిండీస్ భారత్‌ను ఓడించింది. కాబట్టి ఈసారి భారత్‌కు పాత ఓటమికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం కూడా ఉంది.

చిన్న తప్పుతో భారీ మూల్యం..

భారత్ జింబాబ్వేపై భారీ విజయం సాధించి నెట్ రన్ రేట్ మెరుగుపరుచుకున్నప్పటికీ, వెస్టిండీస్ మ్యాచ్‌లో ఓటమి ఎదురైతే అన్ని ప్రయత్నాలు వృథా అవుతాయి. కాబట్టి టీమిండియా పూర్తి దృష్టి, ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యంతో బరిలోకి దిగాల్సి ఉంటుంది.

ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తేనే సెమీఫైనల్ కల సాకారం అవుతుంది. లేనిపక్షంలో టోర్నీ ముగుస్తుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us