IND vs NZ 3rd T20I: మూడో మ్యాచ్‌లో కివీస్‌కు చుక్కలు చూపించిన టీమిండియా.. భారత్ ఖాతాలో మరో సిరీస్..

|

Feb 02, 2023 | 6:00 AM

స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కూడా భారత్ వశమైంది. కివీస్ జట్టుతో జరిగిన ఇటీవలి వన్డే సిరీస్‌ను 3-0 తేడాతో సొంతం చేసుకున్న భారత్..

IND vs NZ 3rd T20I: మూడో మ్యాచ్‌లో కివీస్‌కు చుక్కలు చూపించిన టీమిండియా.. భారత్ ఖాతాలో మరో సిరీస్..
Ind Vs Nz 3rd T20
Follow us on

స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కూడా భారత్ వశమైంది. కివీస్ జట్టుతో జరిగిన ఇటీవలి వన్డే సిరీస్‌ను 3-0 తేడాతో సొంతం చేసుకున్న భారత్.. టీ20 సిరీస్‌ను కూడా 2-1 వ్యత్యాసంతో తన ఖాతాలో వేసుకుంది. బుధవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో 166 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది టీమిండియా. 4 వికెట్లకు 234 పరుగులు చేసిన భారత్‌ ఈ మ్యాచ్‌ను గెలుపులో యంగ్‌ బ్యాట్‌మెన్‌ శుభ్‌మన్‌ గిల్ సెంచరీతో చెలరేగిపోయి అండగా నిలిచాడు. అలాగే టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా 4 వికెట్లతో ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను మట్టికరిపించడంతో.. భారీ లక్ష్య ఛేదనతో క్రీజులోకి వచ్చిన కివీస్ 66 పరుగులకే పరిమితమయింది. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ భారత్ సొంతమయింది.

మొదటగా టాస్ గెలిచిన భారత్.. బ్యాటింగ్ ఎంచుకోవడంతో శుభమాన్ గిల్, ఇషాన్ కిషన్ జట్టు ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. అయితే బ్యాటింగ్‌‌కు దిగిన ఆరంభంలోనే రెండో ఓవర్లో ఇషాన్ కిషన్ (1) రూపంలో భారత్‌ తన తొలి వికెట్‌ను కోల్పోయింది. తర్వాత క్రీజులోకి వచ్చిన రాహుల్ త్రిపాఠీతో కలిసి శుభ్‌మన్ గిల్ చెలరేగడంతో ఇండియా స్కోరు పరుగులు తీసింది. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు 42 బంతుల్లోనే 80 రన్స్ జోడించారు. త్రిపాఠీ కేవలం 22 బాల్స్‌లోనే 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 44 రన్స్ చేశాడు. తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ కూడా కాసేపు మెరుపులు మెరిపించి ఔటయ్యాడు. సూర్య 13 బంతుల్లో 24 పరుగులు చేశాడు. అనంతరం వచ్చిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా 17 బంతుల్లో 30 రన్స్ చేసి చివరి ఓవర్లో పెవిలియన్ చేరాడు. ఇక శుభమాన్ గిల్ 63 బంతుల్లో 126 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఫలితంగా భారత్ 4 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేయగలిగింది.

కాగా, భారీ లక్ష్యంతో అనంతరం క్రీజులోకి వచ్చిన కివీస్ జట్టు ఆరంభం నుంచి పేలవంగా ఆడిందని చెప్పుకోవాలి. న్యూజిలాండ్ తరఫున డరైల్ మిచెల్(35), మిచెల్ సాన్ట్నర్(13) మినహా మిగిలినవారంత రెండు సంఖ్యల స్కోరును అందుకోలేకపోయారు. ఈ క్రమంలో భారత టీ20 కెప్టన్ 4 వికెట్లను పడగొట్టాడు. ఇంకా అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, శివం మావి తలో 2 వికెట్లను తీసుకున్నారు. ఫలితంగా కివీస్ జట్టు 66 పరుగులకే పరిమితమై 166 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి.