వన్డేల్లో భారత్ చెత్త రికార్డు!

|

Jul 01, 2019 | 9:13 PM

బర్మింగ్‌హామ్‌: ప్రపంచకప్‌లో వరుస విజయాలతో ఊపు మీద ఉన్న భారత్‌కు ఆతిధ్య ఇంగ్లాండ్ జట్టు కళ్లెం వేసింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌పై ఇంగ్లాండ్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో టోర్నీలో మొదటి ఓటమిని భారత్ చవి చూసింది. అయితే ఈ ఓటమితో ఇండియా తన ఖాతాలో ఓ చెత్త రికార్డును వేసుకుంది. ఇప్పటివరకు భారత్ జట్టు 972 వన్డేలు ఆడగా.. అందులో 505 విజయాలు సాధించి.. 418 పరాజయాల్ని నమోదు చేసింది. మరో […]

వన్డేల్లో భారత్ చెత్త రికార్డు!
Follow us on

బర్మింగ్‌హామ్‌: ప్రపంచకప్‌లో వరుస విజయాలతో ఊపు మీద ఉన్న భారత్‌కు ఆతిధ్య ఇంగ్లాండ్ జట్టు కళ్లెం వేసింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌పై ఇంగ్లాండ్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో టోర్నీలో మొదటి ఓటమిని భారత్ చవి చూసింది. అయితే ఈ ఓటమితో ఇండియా తన ఖాతాలో ఓ చెత్త రికార్డును వేసుకుంది.

ఇప్పటివరకు భారత్ జట్టు 972 వన్డేలు ఆడగా.. అందులో 505 విజయాలు సాధించి.. 418 పరాజయాల్ని నమోదు చేసింది. మరో 40 మ్యాచ్‌లు రద్దు కాగా, 9 మ్యాచ్‌లు టైగా ముగిశాయి. కాగా భారత్ విజయాల శాతం 54.66గా ఉంది. ఇది మూడో అత్యుత్తమం. ఇది ఇలా ఉంటే భారత్‌ జట్టు వన్డే చరిత్రలో అత్యధిక పరాజయాలు చవిచూసిన జట్టుగా వరల్డ్ రికార్డు సాధించింది. ఈ జాబితాలో శ్రీలంకతో కలిసి భారత్‌ సంయుక్తంగా అగ్రస్థానానికి పంచుకుంది.