AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WTC Final: రోహిత్ సేనకు గుడ్‌న్యూస్.. లంక ఓటమితో డబ్ల్యూటీసీ ఫైనల్ చేరిన టీమిండియా.. మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడంటే?

IND vs AUS: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జూన్ 7 నుంచి ఓవల్‌లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరగనుంది.

WTC Final: రోహిత్ సేనకు గుడ్‌న్యూస్.. లంక ఓటమితో డబ్ల్యూటీసీ ఫైనల్ చేరిన టీమిండియా.. మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడంటే?
Teamindia
Venkata Chari
|

Updated on: Mar 13, 2023 | 12:29 PM

Share

ఎట్టకేలకు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు టీం ఇండియాకు టికెట్ ఓకే అయింది. న్యూజిలాండ్ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా ఫైనల్‌ చేరడం ఖరారైంది. క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ 2 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించింది. టీమ్ ఇండియాను ఫైనల్‌కు వెళ్లకుండా అడ్డుకోవడానికి, శ్రీలంక జట్టు న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌ను 2-0తో గెలవాల్సి ఉంది. అయితే క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయిన శ్రీలంక జట్టు ఫైనల్ రేసు నుంచి బయటపడింది. అదే సమయంలో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేరుకుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జూన్ 7 నుంచి ఓవల్‌లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరగనుంది.

2021లో టీమిండియా ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో తలపడిన సంగతి తెలిసిందే. అయితే ఆ మ్యాచ్‌లో భారత జట్టు 8 వికెట్ల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఇప్పుడు మరోసారి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించే అవకాశం టీమిండియాకు దక్కింది. ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది.

WTC ఫైనల్‌కు భారత్ ఎలా చేరిందంటే?

ఇంగ్లండ్‌తో సిరీస్‌ను 2-2తో సమం చేసింది.

ఇవి కూడా చదవండి

స్వదేశంలో న్యూజిలాండ్‌పై భారత్ 1-0తో విజయం సాధించింది.

దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో భారత్ 2-1 తేడాతో ఓడిపోయింది.

భారత్ 2-0తో శ్రీలంకపై విజయం సాధించింది.

బంగ్లాదేశ్‌పై భారత్ 2-0తో విజయం సాధించింది.

ఆస్ట్రేలియాతో సిరీస్ 2-1తో ముందుంది.

ఉత్కంఠ మ్యాచ్‌లో ఓడిన శ్రీలంక..

న్యూజిలాండ్‌తో జరిగిన క్రైస్ట్‌చర్చ్ టెస్ట్‌లో శ్రీలంక గెలిచే అవకాశం ఉంది. అయితే ఆట చివరి రోజు వర్షం కురిసింది. మొదటి సెషన్ ఆట పూర్తిగా కొట్టుకుపోయింది. న్యూజిలాండ్‌కు శ్రీలంక 285 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. శ్రీలంక జట్టు కూడా ఆతిథ్య జట్టుకు మూడు షాక్‌లు ఇచ్చింది. కానీ, ఆ తర్వాత కేన్ విలియమ్సన్, డారెల్ మిచెల్ జోడి ఆట మొత్తాన్ని మలుపు తిప్పింది. దీంతో చివరి బంతికి న్యూజిలాండ్‌ను గెలిపించిన విలియమ్సన్.. కెప్టెన్స్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.

121 పరుగులతో అజేయంగా నిలిచిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ న్యూజిలాండ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన డారెల్ మిచెల్ రెండో ఇన్నింగ్స్‌లోనూ 86 బంతుల్లో 81 పరుగులు చేశాడు. చివరి ఓవర్‌లో న్యూజిలాండ్‌కు 8 పరుగులు అవసరం కాగా, ఆఖరి బంతికి ఈ జట్టు గెలిచింది. ఆఖరి బంతికి కూడా కేన్ విలియమ్సన్ రన్ ఆఫ్ బై అవుటయ్యాడు. ఈ సమయంలో రనౌట్ కోసం అప్పీల్ కూడా వచ్చింది. అయితే విలియమ్సన్ బంతి వికెట్‌ను తాకడానికి ముందే క్రీజులోకి వచ్చాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..