IND vs PAK: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. తొలిసారి ఫైనల్ పోరుకు సిద్ధమైన భారత్, పాక్.. రికార్డ్ మ్యాచ్‌కు రెడీనా..!
India vs Pakistan: ఆసియా క్రీడలు 2026 (Asian Games 2026) పురుషుల క్రికెట్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు ఇంకా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. వర్షం కారణంగా క్వార్టర్ ఫైనల్స్ రద్దవడంతో రెండు జట్లు సెమీఫైనల్‌కు చేరాయి. ఇప్పుడు ఇరు జట్లు తమ తదుపరి మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే ఫైనల్‌లో దాయాదుల పోరు జరిగే అవకాశం ఉంది.

India vs Pakistan: ఆసియా క్రీడలు 2026 (Asian Games 2026) పురుషుల క్రికెట్‌లో భారత్ (India), పాకిస్థాన్ (Pakistan) మధ్య ఫైనల్ పోరు జరిగే అవకాశం కనిపిస్తోంది. సోమవారం రెండు జట్ల క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. పాకిస్థాన్‌కు హాంకాంగ్ (Hong Kong)తో జరగాల్సిన మ్యాచ్‌లో టాస్ కూడా పడలేదు. అదే పరిస్థితి భారత్, ఆఫ్ఘనిస్థాన్ (Afghanistan) పోరులోనూ ఎదురైంది. నిషిన్‌లోని కొరోగి స్పోర్ట్స్ పార్క్‌లో తడి మైదానం కారణంగా ఆటకు అవకాశం లేకపోయింది. క్వార్టర్ ఫైనల్‌లో మెరుగైన ర్యాంకింగ్ ఉన్న జట్టుకు సెమీఫైనల్ బెర్త్ దక్కే నిబంధనతో రెండు జట్లూ చివరి నాలుగు దశకు చేరాయి. దీంతో ఇప్పటివరకు టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే భారత్, పాకిస్థాన్ సెమీఫైనల్‌లో నిలిచాయి. ఇప్పుడు వారి తదుపరి అడుగు కీలకం కానుంది.
పాకిస్థాన్‌కు తొలి సెమీఫైనల్‌లో బంగ్లాదేశ్ (Bangladesh), మలేషియా (Malaysia) మధ్య జరిగే నాలుగో క్వార్టర్ ఫైనల్ విజేత ప్రత్యర్థిగా వస్తుంది. ఈ మ్యాచ్ అక్టోబర్ 1న జరగనుంది. మరోవైపు భారత్ రెండో సెమీఫైనల్‌లో శ్రీలంక (Sri Lanka), నేపాల్ (Nepal) మధ్య పోరు విజేతను ఎదుర్కోనుంది. ఆ మ్యాచ్ కూడా అక్టోబర్ 1న జరుగుతుంది.
ఇరు సెమీఫైనల్స్‌లో భారత్, పాకిస్థాన్ గెలిస్తే ఆసియా క్రీడల ఫైనల్‌లోనే దాయాదుల సమరం చూడొచ్చు. ఈ పోరు జరిగితే పురుషుల ఆసియా క్రీడల క్రికెట్ చరిత్రలో ఇదే తొలి భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అవుతుంది.
సెమీఫైనల్స్ కూడా వర్షం కారణంగా రద్దయితే మరో ఆసక్తికర పరిస్థితి ఏర్పడుతుంది. ఫలితం లేకుండా మ్యాచ్ ముగిస్తే పోటీ నిబంధనల ప్రకారం మెరుగైన సీడింగ్ ఉన్న జట్టుకు ఫైనల్ బెర్త్ దక్కుతుంది. ప్రస్తుత ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్ మొదటి స్థానంలో ఉండగా, పాకిస్థాన్ ఐదో స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ ఎనిమిదో స్థానంలో, శ్రీలంక తొమ్మిదో స్థానంలో, నేపాల్ 14వ స్థానంలో, మలేషియా 25వ స్థానంలో ఉన్నాయి.
ఎక్కువమంది చదివినది: టాస్ కూడా పడకుండానే ముగిసిన మ్యాచ్.. నేరుగా సెమీస్‌లోకి భారత్
అందువల్ల మిగిలిన క్వార్టర్ ఫైనల్స్ ఫలితాలు ఎలా ఉన్నా, సెమీఫైనల్స్‌కు వర్షం అడ్డంకిగా మారితే భారత్, పాకిస్థాన్ ఫైనల్ చేరే పరిస్థితి ఉంటుంది.
భారత్‌కు ఆసియా క్రీడల పురుషుల క్రికెట్‌లో పాకిస్థాన్‌తో ఇంతవరకు మ్యాచ్ జరగలేదు. రెండు జట్లు ఫైనల్‌కు చేరితే ఆ లోటు తీరనుంది. శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) నేతృత్వంలోని భారత్ ఇటీవల జపాన్‌పై రెండు పరుగుల తేడాతో గెలిచింది. జపాన్‌లో జరిగిన ఆ మ్యాచ్ భారత్‌కు ఏకైక అంతర్జాతీయ పోరు కాగా, పాకిస్థాన్ జట్టు అక్కడ ఇంకా మ్యాచ్ ఆడలేదు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..!




