AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓట్స్ తింటే రెండ్రోజుల్లోనే కొలెస్ట్రాల్ తగ్గుతుందా? డాక్టర్లు చెబుతున్న నిజాలు తెలిస్తే..

శరీరంలో కొవ్వు శాతాన్ని తగ్గించుకోవడానికి, సన్నగా మారడానికి చాలామంది రోజూ ఉదయం పూట ఓట్స్‌ను తమ ఆహారంలో భాగం చేసుకుంటుంటారు. ఓట్స్‌లో ఉండే అధిక పీచు పదార్ధం జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, కడుపు నిండుగా ఉండేలా చేసి బరువు నియంత్రణలో సహాయపడుతుంది. అయితే, ఇటీవలి కాలంలో ఓట్స్‌కు సంబంధించి ఓ ఆసక్తికరమైన పరిశోధన తెరపైకి వచ్చింది. కేవలం రెండు రోజుల పాటు ఓట్స్ తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుందని యూనివర్సిటీ ఆఫ్ బాన్ పరిశోధకులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో అసలు ఈ అధ్యయనం ఏం చెబుతోంది? దీని వెనుక ఉన్న నిజానిజాలు ఏంటో వైద్యులు ఎలా వివరిస్తున్నారో ఇక్కడ తెలుసుకుందాం.

ఓట్స్ తింటే రెండ్రోజుల్లోనే కొలెస్ట్రాల్ తగ్గుతుందా? డాక్టర్లు చెబుతున్న నిజాలు తెలిస్తే..
Oats For CholesterolImage Credit source: tv9 telugu
Jyothi Gadda
|

Updated on: Oct 21, 2026 | 7:13 AM

Share

యూనివర్సిటీ ఆఫ్ బాన్ నిర్వహించిన ఇటీవలి అధ్యయనం ప్రకారం, కేవలం రెండు రోజుల పాటు తక్కువ కేలరీలు కలిగిన ఓట్స్ ఆధారిత ఆహారాన్ని తీసుకోవడం ద్వారా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (LDL) దాదాపు 10 శాతం వరకు తగ్గినట్లు తేలింది. నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం, మెటబాలిక్ సిండ్రోమ్‌తో బాధపడుతున్న కొందరిపై ఓట్స్‌ను ప్రయోగించారు. సుమారు 32 మంది పురుషులు, మహిళలు రెండు రోజుల పాటు రోజూ తినే సాధారణ కేలరీల్లో సగం మోతాదును, అంటే కేవలం ఉడికించిన ఓట్స్‌ను మాత్రమే తీసుకున్నారు. ఈ రెండ్రోజుల ఆహార ప్రయోగం తర్వాత వారిని పరీక్షించగా, వారి శరీరంలోని హానికరమైన చెడు కొలెస్ట్రాల్ (LDL) లెవెల్స్ సుమారు 10 శాతం వరకు తగ్గినట్లు గుర్తించారు. అంతేకాకుండా, వారు సగటున రెండు కిలోల వరకు బరువు కూడా తగ్గినట్లు పరిశోధకులు తేల్చారు.

ఇది ఎలా పనిచేస్తుంది?

ఓట్స్‌లో బీటా గ్లూకాన్ అనే ప్రత్యేకమైన ఫైబర్ మరియు పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి పేగుల్లోని సూక్ష్మజీవులతో కలిసి ఫెరులిక్ యాసిడ్ వంటి పదార్థాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ ప్రక్రియ వల్ల పేగుల్లోని కణాలకు శక్తి అంది జీవక్రియ మెరుగుపడుతుంది. ఆరు వారాల పాటు తక్కువ మోతాదులో ఓట్స్ తినడం కంటే, కేవలం రెండు రోజుల పాటు క్రమం తప్పకుండా ఓట్స్ ఆధారిత లో-కేలరీ ఆహారం తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు కనిపిస్తాయని ఈ అధ్యయనం పేర్కొంది.

కొలెస్ట్రాల్ పెరిగితే వచ్చే ముప్పులు

రక్తంలో చెడు కొలెస్ట్రాల్ మోతాదు పెరిగితే అది రక్తనాళాల గోడలలో పేరుకుపోయి రక్త ప్రసరణకు అడ్డంకిగా మారుతుంది. ఒత్తిడి లేదా బీపీ పెరిగినప్పుడు ఈ కొవ్వు నిక్షేపాలు పగిలి రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉంది. ఇది మునుముందుకు గుండెపోటు, పక్షవాతం వంటి ప్రాణాంతక సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి, కొలెస్ట్రాల్‌ను ప్రారంభ దశలోనే అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం.

ఇవి కూడా చదవండి

వైద్యుల హెచ్చరికలు, సలహా

ఓట్స్‌ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ, వైద్య నిపుణులు కొన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఓట్స్ తీసుకున్నంత మాత్రానా వాటిని గుండె జబ్బుల మందులకు ప్రత్యామ్నాయంగా భావించకూడదు. ఇది కేవలం మన శరీరానికి ఒక సహాయకారిగా మాత్రమే పనిచేస్తుంది. మీ శరీర తత్వాన్ని బట్టి ఏ రకమైన ఆహారం లేదా డైట్ తీసుకోవాలనే దానిపై నిపుణులైన డైటీషియన్ లేదా వైద్యుల సలహా తీసుకోవడం ఎప్పుడూ ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us