AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS: తుఫాన్ సెంచరీతో ఇంగ్లీష్ ఊచకోత.. టీమిండియా ముందు భారీ టార్గెట్..

IND vs AUS: టీ20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో భారత్‌కు ఆస్ట్రేలియా 209 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. విశాఖపట్నంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కంగారుల జట్టు 20 ఓవర్లలో 3 వికెట్లకు 208 పరుగులు చేసింది. జోష్ ఇంగ్లిస్ 50 బంతుల్లో 110 పరుగులతో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. తన T-20 కెరీర్‌లో తొలి సెంచరీని నమోదు చేశాడు. ఇంగ్లిష్‌తో పాటు స్టీవ్ స్మిత్ 52 పరుగులు చేశాడు. వీరిద్దరూ 66 బంతుల్లో 130 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

IND vs AUS: తుఫాన్ సెంచరీతో ఇంగ్లీష్ ఊచకోత.. టీమిండియా ముందు భారీ టార్గెట్..
Ind Vs Aus 1st T20i
Venkata Chari
|

Updated on: Nov 23, 2023 | 9:03 PM

Share

IND vs AUS: టీ20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో భారత్‌కు ఆస్ట్రేలియా 209 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. విశాఖపట్నంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కంగారుల జట్టు 20 ఓవర్లలో 3 వికెట్లకు 208 పరుగులు చేసింది.

జోష్ ఇంగ్లిస్ 50 బంతుల్లో 110 పరుగులతో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. తన T-20 కెరీర్‌లో తొలి సెంచరీని నమోదు చేశాడు. ఇంగ్లిష్‌తో పాటు స్టీవ్ స్మిత్ 52 పరుగులు చేశాడు. వీరిద్దరూ 66 బంతుల్లో 130 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

భారత్ తరపున ప్రసీద్ధ్ కృష్ణ, రవి బిష్ణోయ్ చెరో వికెట్ తీశారు. ఒక బ్యాట్స్‌మెన్ రనౌట్ అయ్యాడు.

డెత్ ఓవర్లలో ఆస్ట్రేలియా 47 పరుగులు..

డెత్ ఓవర్లలో ఆస్ట్రేలియా 47 పరుగులు జోడించింది. 17వ ఓవర్లో అర్ష్దీప్ సింగ్ ముందు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ 18 పరుగులు జోడించారు. జోష్ ఇంగ్లీష్ 18వ ఓవర్లో సెంచరీ చేసిన తర్వాత ఔటయ్యాడు, అయితే 19వ ఓవర్లో 16 పరుగులు వచ్చాయి. 20వ ఓవర్లో ముఖేష్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేసి 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు. డెత్ ఓవర్‌లో ఆస్ట్రేలియా 47 పరుగులు జోడించగా, భారత్‌కు 1 వికెట్ లభించింది.

మిడిల్ ఓవర్లలో ఆస్ట్రేలియా ఆధిపత్యం..

మిడిల్ ఓవర్లలో ఆస్ట్రేలియా వేగంగా పరుగులు సాధించింది. స్టీవ్ స్మిత్ జోష్ ఇంగ్లిస్‌కు మద్దతుగా నిలిచాడు. ప్రతి ఓవర్‌లో 8+ రన్ రేట్‌తో పరుగులు చేశాడు. 15వ ఓవర్‌లో రవి బిష్ణోయ్‌పై ఇంగ్లీష్ 21 పరుగులు చేశాడు. దీంతో స్మిత్‌, ఇంగ్లిష్‌లు 66 బంతుల్లో 130 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 16వ ఓవర్లో స్టీవ్ స్మిత్ రనౌట్ అయ్యాడు. మిడిల్ ఓవర్లలో ఆస్ట్రేలియా ఒక వికెట్ కోల్పోయి 101 పరుగులు జోడించింది.

ఇరుజట్ల ప్లేయింగ్ 11:

భారత జట్టు: రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్(కీపర్), సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ.

ఆస్ట్రేలియా జట్టు: మాథ్యూ షార్ట్, స్టీవెన్ స్మిత్, జోష్ ఇంగ్లిస్, ఆరోన్ హార్డీ, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్(కీపర్/కెప్టెన్), సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, తన్వీర్ సంఘ.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..