IND vs ENG: చివరి మ్యాచ్‌లో ఓడిన భారత్.. 2-1 తేడాతో సిరీస్ గెలిచిన రోహిత్ సేన..

| Edited By: Ravi Kiran

Jul 11, 2022 | 9:29 AM

భారత్‌తో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసి భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొంది ఇంగ్లాండ్ టీమ్.

IND vs ENG: చివరి మ్యాచ్‌లో ఓడిన భారత్.. 2-1 తేడాతో సిరీస్ గెలిచిన రోహిత్ సేన..
India Vs England
Follow us on

England vs India 3rd T20I Nottingham: సూర్యకుమార్ యాదవ్ ఒంటరి పోరాటం వృధా అయింది. మూడో మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయింది. 17 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ గెలిచింది. అయితే మూడు మ్యాచ్‌ల టీ ట్వంటీ సిరీస్‌లో ముందే రెండు మ్యాచ్‌ల గెలిచిన టీమిండియా సిరీస్‌ గెలిచింది.

టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్.. క్లీన్ స్వీప్ తప్పించుకోవాలని పట్టుదలతో ఆడింది. డేవిడ్ మలాన్ 39 బంతుల్లో 77 రన్స్ కొట్టాడు. డేవిడ్ మలాన్ కు తోడుగా లియామ్ లివింగ్ స్టోన్ 29 బంతుల్లో 42 నాటౌట్‌తో చెలరేగిపోయారు. దీంతో 20 ఓవర్లలో 215 పరుగులు చేసింది ఇంగ్లాండ్.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రోహిత్ సేనకు శుభారంభం లభించలేదు. బ్యాటర్లందరూ చేతులెత్తేశారు. మిడిలార్డర్లో సూర్యకుమార్ యాదవ్ మాత్రం.. ఇంగ్లాండ్ బౌలర్లను ఊచకోత కోశాడు. 55 బంతుల్లోనే 117 రన్స్ చేశాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ 28 పరుగులతో కొంచేపు క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడు. కానీ చివర్లో వరుస ఓవర్లలో వీళ్లిద్దరూ వికెట్ కోల్పోవడంతో.. మ్యాచ్ ఇంగ్లాండ్ సొంతమైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి