ODI World Cup 2023: ఆ మూడే కీలకం.. ఉతికారేస్తే.. టీమిండియాదే వన్డే ప్రపంచకప్ ట్రోఫీ.. డిసైడ్ అయ్యేది ఆరోజే?

ODI World Cup 2023: ప్రపంచ కప్ షెడ్యూల్ ప్రకారం, భారత జట్టు అక్టోబర్ 8 నుంచి తన జర్నీని ప్రారంభించనుంది. టీమ్ ఇండియా తొమ్మిది జట్లతో తొమ్మిది వేర్వేరు మైదానాల్లో మ్యాచ్‌లు ఆడనుంది.

ODI World Cup 2023: ఆ మూడే కీలకం.. ఉతికారేస్తే.. టీమిండియాదే వన్డే ప్రపంచకప్ ట్రోఫీ.. డిసైడ్ అయ్యేది ఆరోజే?
Indian Cricket Team

Updated on: Jun 29, 2023 | 10:05 AM

ODI World Cup 2023: 2011 తర్వాత టీమిండియా తొలిసారిగా స్వదేశంలో వన్డే ప్రపంచకప్ ఆడనుంది. ప్రపంచకప్ షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 8 నుంచి భారత జట్టు తమ ప్రయణాన్ని ప్రారంభించనుంది. టీమ్ ఇండియా తొమ్మిది జట్లతో తొమ్మిది వేర్వేరు మైదానాల్లో మ్యాచ్‌లు ఆడనుంది. స్వదేశంలో ఈ ప్రపంచకప్‌ ఆడుతున్నందున భారత్‌ ప్రపంచకప్‌ గెలవడానికి బలమైన పోటీదారుగా ఉంటుంది. అయితే భారత్‌ ప్రపంచ ఛాంపియన్‌గా నిలవడం అంత సులభం కాదు. ఈ ప్రపంచకప్ ప్రయాణంలో భారత్ బలమైన జట్లతో తలపడాల్సి ఉంది. ముఖ్యంగా ఈ మూడు మ్యాచ్‌లు భారత్‌ ప్రపంచకప్ కలను డిసైడ్ చేయనున్నాయి.

నిజానికి ఈ ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్ వంటి బలమైన జట్లతో టీమిండియా తలపడాల్సి ఉంది. ఈ మూడు జట్లను ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో బలమైన జట్లుగా పరిగణిస్తున్నారు. ఒకవైపు డిఫెండింగ్ ఛాంపియన్ టైటిల్‌తో ఇంగ్లండ్ ఈ ప్రపంచకప్ లో అడుగుపెడుతోంది. మరోవైపు వరుసగా రెండు ప్రపంచకప్ ఫైనల్స్‌లో ఓడిపోవడంతో న్యూజిలాండ్ ఈ ప్రపంచకప్ గెలవాలనే ఒత్తిడిలో ఉంటుంది. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియా కూడా ప్రపంచకప్‌ను గెలవడానికి ప్రధాన పోటీదారుగా ఉంటుంది.

అలాగే ఈ మూడు జట్లతో టీమిండియా ఆడుతున్న మైదానం ఇప్పుడు టీమ్ ఇండియా అభిమానులను ఆందోళనకు గురి చేసింది. అలా అయితే, ఈ మూడు జట్లతో భారత్ ఏ మైదానంలో ఆడుతుంది? ఈ మైదానంలో టీమిండియా ప్రదర్శన ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి

అక్టోబర్ 8న చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో భారత్ తన తొలి మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఇక్కడి పిచ్ నిదానంగా ఉండటం వల్ల స్పిన్నర్లకు ఉపయోగపడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ జట్టులో మంచి స్పిన్నర్లు ఉన్నా, ఆసీస్ జట్టు బ్యాట్స్‌మెన్స్ కూడా స్పిన్నర్లను బాగా ఆడటంతో అసలు టెన్షన్ మొదలైంది. అయితే ఈ పిచ్‌కు అనుగుణంగా జట్టును నిర్మించే సత్తా కూడా ఆస్ట్రేలియాకు ఉంది. కంగారూ జట్టులో కూడా చెన్నై పిచ్‌కు అవసరమైన ఆటగాళ్లు ఉన్నారు. గత మార్చిలో ఇదే మైదానంలో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు 21 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది.

దీని తర్వాత, అక్టోబర్ 22 న ధర్మశాలలో న్యూజిలాండ్‌తో భారత్ తదుపరి టఫ్ మ్యాచ్. ధర్మశాల పిచ్ బౌన్సర్, ఫాస్ట్ బౌలర్‌లకు మరింత సహాయం చేస్తుంది. న్యూజిలాండ్ బౌలర్లకు అనుకూలమైన పిచ్ ఇది.

కివీస్ జట్టులోని ట్రెంట్ బౌల్ట్, లాకీ ఫెర్గూసన్, టిమ్ సౌథీ వంటి బౌలర్లు ఇలాంటి పిచ్‌ను సద్వినియోగం చేసుకోవడంలో నిష్ణాతులు. దీనికి విరుద్ధంగా బౌన్సీ, ఫాస్ట్ పిచ్‌లపై భారత బ్యాట్స్‌మెన్‌ల బలహీనత అందరికీ తెలిసిందే. కాబట్టి ఇక్కడ న్యూజిలాండ్ కూడా భారత్‌పై ఆధిపత్యం చెలాయించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

అక్టోబర్ 29న లక్నోలో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ టీమ్ ఇండియాతో మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌కు లక్నోలోని ఎకానా స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఇటీవల ఈ స్టేడియంలో జరిగిన ఐపీఎల్‌లో కూడా ఈ పిచ్ స్లోగా ఉండడంతో స్పిన్నర్లకు సాయం చేసేలా కనిపించింది.

ఇంగ్లండ్ అత్యుత్తమ లెగ్ స్పిన్నర్‌లలో ఒకరైన ఆదిల్ రషీద్‌ను కలిగి ఉండగా, జట్టులో అత్యుత్తమ ఆఫ్ స్పిన్నర్ మొయిన్ అలీ కూడా ఉన్నాడు. వీరిద్దరూ కాకుండా ఇంగ్లండ్‌కు లియామ్ లివింగ్‌స్టన్ రూపంలో మరో పార్ట్‌టైమ్ స్పిన్నర్ కూడా ఉన్నాడు.

ఇటీవలి కాలంలో కోహ్లితో సహా చాలా మంది టీమ్ ఇండియా ఆటగాళ్లు స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు కష్టపడడం మనం చూశాం. ఇలాంటి పరిస్థితుల్లో ఇంగ్లండ్ స్పిన్నర్ల ఆధారంగా భారత్‌ను ఇక్కడ ఓడించే సత్తా ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..