AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Highest ODI Runs : పురుషులలో సచిన్, మహిళల వన్డేలో కూడా అత్యధిక పరుగుల రికార్డు మనోళ్లదే

అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు పురుషుల, మహిళల విభాగాలలో ఒకే దేశానికి చెందిన ఆటగాళ్ల పేరు మీద ఉండటం భారత క్రికెట్‌కు గర్వకారణం. పురుషుల క్రికెట్‌లో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఈ రికార్డును నెలకొల్పగా, మహిళల క్రికెట్‌లో లేడీ టెండూల్కర్ మిథాలీ రాజ్ ఈ అరుదైన ఘనతను సాధించింది.

Highest ODI Runs : పురుషులలో సచిన్, మహిళల వన్డేలో కూడా అత్యధిక పరుగుల రికార్డు మనోళ్లదే
India Run Records
Rakesh
|

Updated on: Nov 04, 2025 | 8:42 PM

Share

Highest ODI Runs : అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు పురుషుల, మహిళల విభాగాలలో ఒకే దేశానికి చెందిన ఆటగాళ్ల పేరు మీద ఉండటం భారత క్రికెట్‌కు గర్వకారణం. పురుషుల క్రికెట్‌లో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఈ రికార్డును నెలకొల్పగా, మహిళల క్రికెట్‌లో లేడీ టెండూల్కర్ మిథాలీ రాజ్ ఈ అరుదైన ఘనతను సాధించింది. పురుషుల విభాగంలో సచిన్ 18,426 పరుగులు, మహిళల విభాగంలో మిథాలీ రాజ్ 7,805 పరుగులు చేసి తమ తమ విభాగాలలో అగ్రస్థానంలో నిలిచారు. ఈ ఇద్దరు దిగ్గజాలు సాధించిన అద్భుతమైన రికార్డుల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

భారత క్రికెట్‌కే గర్వకారణంగా నిలిచిన దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, పురుషుల వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా ఉన్నారు. సచిన్ టెండూల్కర్ తన 24 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో 463 వన్డే మ్యాచ్‌లు ఆడి, ఏకంగా 18,426 పరుగులు సాధించాడు. ఇది పురుషుల వన్డే క్రికెట్‌లో ప్రపంచ రికార్డు. ఆయన తన కెరీర్‌లో 49 సెంచరీలు, 96 హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. అంతేకాక, వన్డే చరిత్రలో మొదటి డబుల్ సెంచరీ (200 నాటౌట్) చేసిన పురుష క్రికెటర్ కూడా సచినే. ఆయన 2010లో దక్షిణాఫ్రికాపై గ్వాలియర్‌లో ఈ ఘనత సాధించాడు. సచిన్ ఆట ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది యువకులకు ప్రేరణగా నిలిచింది.

భారత మహిళా క్రికెట్‌కు విశేష సేవలందించిన మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ మహిళల వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన ప్రపంచ రికార్డును కలిగి ఉంది. లేడీ టెండూల్కర్‎గా ప్రసిద్ధి చెందిన మిథాలీ రాజ్, 1999 నుంచి 2022 వరకు సాగిన తన సుదీర్ఘ కెరీర్‌లో 211 ఇన్నింగ్స్‌లలో 50.68 సగటుతో మొత్తం 7,805 పరుగులు చేసింది. ఇది మహిళల వన్డే క్రికెట్‌లో ప్రపంచ రికార్డు. ఆమె తన ఖాతాలో 7 సెంచరీలు, 64 హాఫ్ సెంచరీలు నమోదు చేసుకుంది.

మిథాలీ అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లు (టెస్ట్, ODI, T20) కలిపి భారత్ తరఫున 10,868 పరుగులు చేసి, ఆల్‌టైమ్ లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచింది. ఆమె రిటైర్మెంట్ తర్వాత కూడా, ఆమె వారసత్వం కొత్త తరానికి స్ఫూర్తినిస్తోంది. పురుషుల, మహిళల వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఒకే దేశానికి చెందిన ఆటగాళ్ల పేరిట ఉండడం భారత క్రికెట్ కు గర్వకారణం. భారత మహిళల జట్టు 2025లో తొలిసారిగా ప్రపంచకప్ గెలిచింది.ప్రస్తుతం భారత పురుషుల జట్టు వన్డే క్రికెట్‌లో నంబర్ 1 స్థానంలో ఉంది. ఈ రికార్డులు భారత క్రికెట్ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..