Rohit Sharma: 46 పరుగులకు ఆలౌట్.. రోహిత్ శర్మ రియాక్షన్ ఏంటంటే?

|

Oct 17, 2024 | 8:01 PM

46 పరుగులకే ఆలౌట్ కావడంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. తను పిచ్‌ను తప్పుగా అంచనా వేసినట్లు ఆయన చెప్పుకొచ్చారు. తను పిచ్ ప్లాట్‌గా ఉంటుందని అంచనా వేశానని, కానీ తను కరెక్ట్‌గా అర్థం చేసుకోవడంతో విఫలమైనట్లు చెప్పారు.

Rohit Sharma: 46 పరుగులకు ఆలౌట్.. రోహిత్ శర్మ రియాక్షన్ ఏంటంటే?
Rohit Sharma
Follow us on

న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్ భారత్ 46 పరుగులకే ఆలౌట్ కావడంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. తను పిచ్‌ను తప్పుగా అంచనా వేసినట్లు ఆయన చెప్పుకొచ్చారు. తను పిచ్ ప్లాట్‌గా ఉంటుందని అంచనా వేశానని, కానీ తను కరెక్ట్‌గా అర్థం చేసుకోవడంతో విఫలమైనట్లు చెప్పారు. కోహ్లీని వన్ డౌన్‌లో పంపించడానికి కారణం ఏంటో కూడా రోహిత్ తెలిపాడు. ప్రతి సారి కేఎల్ రాహుల్ స్థానన్ని మార్చడం ఇష్టం లేకనే విరాట్‌ను వన్ డౌన్‌లో పంపినట్లు తెలిపారు. టీమిండియా ఆటగాళ్లు తమకున్నా సామర్థ్యానికి తగ్గిట్లుగా ఆడలేదన్నారు.

టాస్ గెలిచిన తర్వాత మొదట బ్యాటింగ్ ఎంచుకోవడం పొరపాటు అని రోహిత్ అంగీకరించాడు. అయితే బ్యాటర్లు తమ ప్రణాళికలను అమలు చేయడంలో విఫలమయ్యారని నొక్కి చెప్పాడు. కఠినమైన పరిస్థితులు ఉన్నప్పటికీ, రోహిత్ నవ్వుతూ ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. న్యూజిలాండ్ 134 పరుగుల ఆధిక్యంతో ఉంది. టీమిండియా పరిస్థితులను సరిగ్గా చదవడంలో విఫలమైంది. వ్యూహాత్మక తప్పిదాలు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బెంగుళూరులో తేమతో కూడిన వాతావరణం కారణంగా గత మూడు రోజులుగా కప్పబడి ఉన్న తర్వాత బూడిద రంగులో తేమతో కూడిన పిచ్‌పై బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇంగ్లాండ్ బౌలర్లు టిమ్ సోథీ, మాట్ హెన్రీలు భారత్ ప్లేయర్లకు చుక్కలు చూపించారు. రిషబ్ పంత్ 20 పరుగులు చేసి భారత్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఐదుగురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి