Ind vs Ban 1st Test Result: అశ్విన్ ఆల్‌రౌండర్ ప్రదర్శన.. 280 పరుగుల తేడాతో ఓడిన బంగ్లాదేశ్.. WTCలో భారత్ భారీ జంప్

బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 280 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆదివారం 515 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ను 234 పరుగులకు ఆలౌట్ చేసింది. దీంతో 2 టెస్టుల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది.

Ind vs Ban 1st Test Result: అశ్విన్ ఆల్‌రౌండర్ ప్రదర్శన.. 280 పరుగుల తేడాతో ఓడిన బంగ్లాదేశ్.. WTCలో భారత్ భారీ జంప్
Ind Vs Ban 1st Test Result
Follow us

|

Updated on: Sep 22, 2024 | 11:49 AM

India vs Bangladesh 1st Test Result: బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 280 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆదివారం 515 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ను 234 పరుగులకు ఆలౌట్ చేసింది. దీంతో 2 టెస్టుల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో మ్యాచ్ సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో జరగనుంది.

ఈ విజయానికి హీరో రవిచంద్రన్ అశ్విన్. తొలి టెస్ట్‌లో 6 వికెట్లు తీశాడు. అలాగే తొలి ఇన్నింగ్స్‌లో 113 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్‌ తరపున కెప్టెన్ నజ్ముల్ హసన్ శాంటో (82 పరుగులు) అర్ధ సెంచరీతో రాణించాడు.

బంగ్లాదేశ్ జట్టు 158/4 స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించింది. శాంటో 51 పరుగులు చేయగా, షకీబ్ 5 పరుగులతో తమ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ 4 వికెట్లకు 287 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి బంగ్లాదేశ్‌కు 515 పరుగుల లక్ష్యాన్ని అందించాడు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 376 పరుగులు చేసింది. దీంతో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ 149 పరుగులకు కుప్పకూలింది.

టీమిండియా విక్టరీ సెలబ్రేషన్స్..

డబ్ల్యూటీసీలోనూ దూకుడు..

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్‌లోనూ టీమిండియా దూకుడు పెంచింది. ఇప్పటికే అగ్రస్థానంలో నిలిచిని రోహిత్ సేన.. మరిన్ని పాయింట్లతో తన తొలి స్థానాన్ని మరింత పటిష్టంగా చేసుకుంది. ఆస్ట్రేలియా జట్టు రెండో స్థానంలో నిలిచింది. ఇవే రెండు జట్లు డబ్ల్యూటీసీ ఫైనల్‌లో తలపడనున్నట్లు తెలుస్తోంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్ వచ్చే ఏడాది జూన్ 11 నుంచి 15 వరకు జరగనుంది.

రెండు జట్ల ప్లేయింగ్-11 ఇదే..

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్.

బంగ్లాదేశ్: నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), షాద్మాన్ ఇస్లాం, జకీర్ హసన్, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్ (వికెట్), మెహిదీ హసన్ మిరాజ్, నహిద్ రాణా, హసన్ మహమూద్, తస్కిన్ అహ్మద్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..