WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు టీమిండియా జట్టు ఇదే.. ఆ ప్లేయర్‌కు మరోసారి నిరాశ.. కోహ్లీపై విమర్శలు.!

|

Jun 15, 2021 | 7:39 PM

ఇంగ్లాండ్‌లోని సౌతాంప్టన్ వేదికగా టీమిండియా, న్యూజిలాండ్ మధ్య జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు భారత జట్టు 15 మంది సభ్యులతో..

WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు టీమిండియా జట్టు ఇదే.. ఆ ప్లేయర్‌కు మరోసారి నిరాశ.. కోహ్లీపై విమర్శలు.!
మరికొన్ని గంటల్లో ఇంగ్లాండ్‌లోని సౌతాంప్టన్ వేదికగా సమరం మొదలు కానుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో న్యూజిలాండ్, భారత్ జట్లు ముఖాముఖి తలబడనున్నాయి. ఇప్పటికే ఈ మ్యాచ్‌కు టీమిండియా 15 మంది సభ్యులను ఎంపిక చేయగా.. వారిలో తుది జట్టులో చోటు ఎవరు దక్కించుకున్నారో ఇప్పుడు చూద్దాం..
Follow us on

ఇంగ్లాండ్‌లోని సౌతాంప్టన్ వేదికగా టీమిండియా, న్యూజిలాండ్ మధ్య జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు భారత జట్టు 15 మంది సభ్యులతో కూడిన స్క్వాడ్‌ను ఎంపిక చేసింది. తుది జట్టులో ఎలాంటి ఎక్స్‌పెరిమెంట్స్ చేయని విరాట్ కోహ్లీ.. మరోసారి తన పాత టీమ్‌పైనే నమ్మకం ఉంచాడు. అయితే ఈసారైన జట్టులో చోటు దక్కుతుందని ఆశించిన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్‌లకు మరోసారి నిరాశే ఎదురైంది. రాహుల్‌ను ఎంపిక చేయకపోవడంపై అతడి ఫ్యాన్స్ కోహ్లీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇద్దరు వికెట్ కీపర్లు ఎందుకని.. రాహుల్‌ను ఎంపిక చేసి ఉండాల్సిందని కామెంట్స్ చేస్తున్నారు.

ఓపెనర్లుగా హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్ బరిలోకి దిగబోతుండగా.. మిడిల్ ఆర్డర్‌‌ను పుజారా, కోహ్లీ, రహనే, విహారిలు చూసుకోనున్నారు. ఇక లోయర్ ఆర్డర్‌లో రిషబ్ పంత్, వృద్దిమాన్ సాహాలు ఉన్నారు. అటు స్పిన్ ద్వయం అశ్విన్, జడేజా.. బౌలర్లు బుమ్రా, ఇషాంత్, షమీ, ఉమేష్ యాదవ్, సిరాజ్‌లు ప్రత్యర్ధులకు చుక్కలు చూపించడం ఖాయం.

ఫైనల్ మ్యాచ్‌కు టీమిండియా జట్టు: రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్, పుజారా, కోహ్లీ, రహనే, విహారి, రిషబ్ పంత్, వృద్దిమాన్ సాహా, అశ్విన్, జడేజా, బుమ్రా, ఇషాంత్, షమీ, ఉమేష్ యాదవ్, సిరాజ్‌

Also Read:

ఈ పాత రూ. 2 నాణెంతో లక్షలు సంపాదించవచ్చు.? ఎలాగో మీరే తెలుసుకోండి.!

అత్తింటి మర్యాదా మజాకా.. కొత్త కోడలికి మెట్టు మెట్టుకో గిఫ్ట్‌.. వైరల్ అవుతున్న వీడియో..

జగన్ సర్కార్ సంచలనం.. ఇకపై ఇంగ్లీష్ మీడియంలోనే డిగ్రీ కోర్సులు.. ఉత్తర్వులు జారీ

 కుండలో నీరు తాగుతున్నారా? అయితే ఈ సూపర్ బెనిఫిట్స్ గురించి తెలుసుకోండి!