
India vs West Indies 1st Test Playing 11: భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉంది. వెస్టిండీస్‌లో టీమిండియా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది. టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్ జులై 12 నుంచి జరగనుంది. తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ జట్టు ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేసే ఛాన్స్ ఉంది. యశస్వి జైస్వాల్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఓపెనర్‌గా రాణిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తొలి టెస్టులో యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ ఖాయం అని భావిస్తున్నారు.
గత కొంతకాలంగా మూడు ఫార్మాట్లలో భారత్ తరపున ఓపెనింగ్ చేస్తున్న శుభ్‌మన్ గిల్.. వెస్టిండీస్‌తో మూడో నంబర్‌లో ఆడగలడు. టెస్ట్ టీమ్‌లో ఛెతేశ్వర్ పుజారాకు బదులుగా గిల్ ఇప్పుడు మూడో స్థానంలో ఆడుతున్నట్లు అనేక వార్తలు వినిపించాయి. అయితే దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
మహ్మద్ షమీ గైర్హాజరీలో ముఖేష్ కుమార్ సిరాజ్‌తో కలిసి కొత్త బంతిని సంధించే అవకాశం ఉంది. అదే సమయంలో శార్దూల్ ఠాకూర్ మూడో ఫాస్ట్ బౌలర్ కావచ్చు. దీంతో పాటు స్పిన్ విభాగంలో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌లు ఉంటారు.
వెస్టిండీస్‌తో జరిగే తొలి టెస్టులో భారత ప్రాబబుల్ ప్లేయింగ్ ఎలెవన్ – రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవి అశ్విన్, శార్దూల్ ఠాకూర్, ముఖేష్ కుమార్, మహ్మద్ సిరాజ్.
రోహిత్ శర్మ (కెప్టెన్), రితురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, ముఖేష్ కుమార్, అజింక్యా రహానే (వైస్ కెప్టెన్), ఆర్ అశ్విన్, మహ్మద్ సిరాజ్, కేఎస్ భరత్ (కీపర్), శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్ (కీపర్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, నవదీప్ సైనీ.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..