Virat Kohli: పొమ్మన్నారా.. పొగపెట్టారా.. ఇకపై టీ20లకు విరాట్ కోహ్లీ దూరం..! ఫ్యాన్స్‌కు షాక్..

విరాట్ కోహ్లీ ఫ్యాన్స్‌కు ఇది నిజం బ్యాడ్‌న్యూస్. కొంతకాలం టీ20 క్రికెట్‌కు టీమిండియా రన్‌మిషన్ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

Virat Kohli: పొమ్మన్నారా.. పొగపెట్టారా.. ఇకపై టీ20లకు విరాట్ కోహ్లీ దూరం..! ఫ్యాన్స్‌కు షాక్..
Virat Kohli

Updated on: Dec 28, 2022 | 9:30 AM

విరాట్ కోహ్లీ ఫ్యాన్స్‌కు ఇది నిజం బ్యాడ్‌న్యూస్. కొంతకాలం టీ20 క్రికెట్‌కు టీమిండియా రన్‌మిషన్ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. దీంతో వచ్చే ఏడాది జనవరిలో శ్రీలంకతో జరగబోయే టీ20 సిరీస్‌కు విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండదు. ఇదిలా ఉంటే.. టీ20లకు దూరంగా ఉండనున్న కోహ్లీ ఇకపై వన్డేలు, టెస్టులకు అందుబాటులో ఉంటాడని బీసీసీఐ వర్గం ఒక ప్రకటనలో తెలిపింది.

‘ఈ నిర్ణయం కోహ్లీ తనకు తానుగా తీసుకున్నది. ఇందులో బీసీసీఐ ప్రమేయం ఏం లేదు. శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్‌కు విరాట్ అందుబాటులో ఉండదు. వన్డే సిరీస్‌కు తిరిగి జట్టులోకి వస్తాడు. ఎన్నాళ్ల పాటు టీ20లకు దూరం ఉంటాడన్నది ఇంకా క్లారిటీ లేదు. కానీ ముఖ్యమైన సిరీస్‌లకు మాత్రం కోహ్లీ పేరును పరిశీలనలో ఉంచుతాం. ఇక రోహిత్ శర్మ పూర్తిగా గాయం నుంచి కోలుకోలేదు. కొద్దిరోజులు పరిశీలించిన అనంతరం తుది నిర్ణయానికి వస్తాం’ అని అధికారి ఒకరు వెల్లడించారు.

ఇటు కోహ్లీ, అటు రోహిత్ శర్మ.. మరోవైపు కెఎల్ రాహుల్ కూడా శ్రీలంకతో జరగబోయే మూడు టీ20ల సిరీస్‌కు దూరం కానుండటంతో జట్టులో భారీ మార్పులు జరిగే అవకాశం ఉంది. పరిమిత ఓవర్లలో పంత్ ఫెయిల్ అవుతుండటంతో అతడికి కూడా రెస్ట్ ఇస్తారని టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా‌కు మళ్లీ జట్టు పగ్గాలు ఇచ్చే అవకాశం ఉంది. కాగా, శ్రీలంకతో మొదటి టీ20 జనవరి 3న ముంబై వేదికగా జరగనుంది. ఆ తర్వాత జనవరి 5న పుణెలో రెండో టీ20, జనవరి 7న రాజ్‌కోట్‌లో మూడో టీ20 జరగనున్నాయి. ఇక వన్డే సిరీస్ జనవరి 10 నుంచి ప్రారంభం కానుంది.(Source)