AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL: ఒకే టెస్ట్‌లో రెండు సెంచరీలు.. భారత్‌పై వరల్డ్ రికార్డు క్రియేట్ చేసిన శ్రీలంక యువ బ్యాటర్

IND vs SL: ఇండియా, శ్రీలంక రెండో టెస్టులో శ్రీలంక యువ బ్యాటర్ సోనల్ దినుష అరుదైన ప్రపంచ రికార్డు సృష్టించాడు. 6 లేదా అంతకంటే దిగువ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి ఒకే టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు చేసిన తొలి బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. భారత్‌పై అద్భుత పోరాటంతో శ్రీలంకకు అండగా నిలిచి దిగ్గజాల సరసన చోటు సంపాదించాడు.

IND vs SL: ఒకే టెస్ట్‌లో రెండు సెంచరీలు.. భారత్‌పై వరల్డ్ రికార్డు క్రియేట్ చేసిన శ్రీలంక యువ బ్యాటర్
Sonal Dinusha
Rakesh
|

Updated on: Aug 27, 2026 | 4:23 PM

Share

IND vs SL: టీమిండియాతో జరిగిన రెండో టెస్టులో సోనల్ దినుష బ్యాటింగ్‌లో కొత్త చరిత్ర సృష్టించాడు. సాధారణంగా మొదట బ్యాటింగుకు దిగిన క్రికెటర్లు సెంచరీలు సాధించడం చూస్తుంటాం. సోనల్ మాత్రం రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ దిగువ వరుసలో వచ్చి సెంచరీలు చేయడం విశేషం. తొలి ఇన్నింగ్స్‌లో 7వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 162 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 103 పరుగులు చేశాడు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో 6వ స్థానంలో వచ్చి 196 బంతుల్లో ల్యాండ్‌మార్క్ దాటి 100 ప్లస్ స్కోర్ అందించాడు. టెస్టు క్రికెట్ చరిత్రలోనే నంబర్ 6 లేదా అంతకంటే దిగువ స్థానాల్లో వచ్చి ఒకే మ్యాచ్‌లోని రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు సాధించిన ప్రపంచంలోనే మొదటి బ్యాటర్‌గా ఆయన నిలిచాడు.

కొలంబో టెస్టు ఆఖరి రోజు భారత్ విజయం దాదాపు ఖాయంగా కనిపించింది. చేతిలో కేవలం 4 వికెట్లు మాత్రమే ఉండి 229 పరుగుల ఆధిక్యంలో ఉన్న లంకను టీమిండియా బౌలర్లు త్వరగానే ఆలౌట్ చేస్తారని భావించారు. చివరి రోజు కేవలం 7 పరుగుల వ్యక్తిగత స్కోరుతో ఆట ప్రారంభించిన దినుష రోజంతా నిలకడగా బ్యాటింగ్ చేశాడు. కేశర నువంత, ప్రభాత్ జయసూర్య, లాహిరు కుమారలను వెంటబెట్టుకుని భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. టీ విరామం తర్వాత మూడో సెషన్ మొదటి బంతికే 2 పరుగులు తీసి తన టెస్ట్ కెరీర్‌లో మూడో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

ఇది కూడా చదవండి: Cricketer Ban: డోపింగ్ ఉచ్చులో 36 ఏళ్ల క్రికెటర్.. 94 మ్యాచ్‌లు ఆడిన వెటరన్ బ్యాటర్ పై 15 నెలల నిషేధం

భారత్‌పై ఒకే టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు బాదిన 12వ బ్యాటర్‌గా సోనల్ దినుష నిలిచాడు. గతంలో డాన్ బ్రాడ్‌మాన్, ఎవర్‌టన్ వీక్స్, అరవింద డిసిల్వా, గ్యారీ కిర్‌స్టెన్, హషీమ్ ఆమ్లా, డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టో వంటి దిగ్గజాలు మాత్రమే ఈ ఘనత సాధించారు. ఇప్పుడు ఆ జాబితాలోకి ఈ యువ సంచలనం చేరాడు. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో అత్యధికంగా 3 సెంచరీలు చేసిన అరవింద డిసిల్వా, జాక్స్ కల్లిస్, విలియమ్‌సన్ సరసన కూడా దినుష చోటు దక్కించుకోవడం విశేషం.

ఇది కూడా చదవండి: T20 Cricket Records: ఆ ఆనందం కాసేపు కూడా లేదు.. బట్లర్‌ను వెనక్కి నెట్టి మళ్ళీ నంబర్ 1గా కీరన్ పోలార్డ్

ఈ టెస్టు సిరీస్‌కు ముందు సోనల్ దినుష కేవలం 3 మ్యాచ్‌లు మాత్రమే ఆడి ఒక్క సెంచరీ కూడా సాధించలేదు. ఈ సిరీస్‌లోని 4 ఇన్నింగ్స్‌ల్లోనూ 50 ప్లస్ స్కోర్లు సాధించి, అందులో 3 ఇన్నింగ్స్‌లను సెంచరీలుగా మలచడం ఆయన స్థిరత్వానికి నిదర్శనం. మైదానంలో తన తల్లి చూస్తుండగానే ఈ అపూర్వ ఘనత సాధించడం ఆయన జీవితంలో మరచిపోలేని అనుభూతిగా మిగిలిపోనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us