148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ హిస్టరీలోనే ఒకే ఒక్కడు.. దిగ్గజాలకే సాధ్యం కాని ప్రపంచ రికార్డ్‌లో సౌతాఫ్రికా కెప్టెన్
South Africa Temba Bavuma World Records: దక్షిణాఫ్రికాను ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌కు నడిపించిన కెప్టెన్ టెంబా బావుమా ఇప్పుడు కొత్త చరిత్ర సృష్టించాడు. అది కూడా 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఎన్నడూ లేని ప్రపంచ రికార్డును సృష్టించడం గమనార్హం.

Temba Bavuma World Records: టెస్ట్ క్రికెట్ ప్రారంభమై సరిగ్గా 148 సంవత్సరాలు అయింది. ఈ 148 సంవత్సరాలలో దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా మరెవరూ సాధించలేని ఒక ప్రత్యేకమైన ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. అది కూడా అపజయం లేని కెప్టెన్‌గా ఉండటం ప్రత్యేకమైనది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో భారత్‌తో జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. టెంబా బావుమా కెప్టెన్సీలో దక్షిణాఫ్రికాకు ఇది 10వ టెస్ట్ విజయం. బావుమా నాయకత్వంలో దక్షిణాఫ్రికా ఆడిన 11 టెస్ట్ మ్యాచ్‌లలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకపోవడం విశేషం.
దీంతో, టెంబా బావుమా టెస్ట్ చరిత్రలో తన మొదటి 10 మ్యాచ్‌లలో ఒక్కటి కూడా ఓడిపోకుండా గెలిచిన తొలి కెప్టెన్‌గా నిలిచాడు. అతి తక్కువ మ్యాచ్‌లలో తన మొదటి 10 మ్యాచ్‌లను గెలిచిన కెప్టెన్‌గా కూడా అతను రికార్డు సృష్టించాడు.
గతంలో, ఇలాంటి ప్రత్యేక రికార్డు ఇంగ్లాండ్‌కు చెందిన బెన్ స్టోక్స్, ఆస్ట్రేలియాకు చెందిన లిండే హాసెట్ పేరిట ఉండేది. టెస్ట్ క్రికెట్‌లో కెప్టెన్లుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వారిద్దరూ తమ మొదటి 12 మ్యాచ్‌ల్లో 10 మ్యాచ్‌లను గెలిచారు. ఇప్పుడు, బావుమా ఈ రికార్డులను చెరిపేశాడు.
టెంబా బావుమా నేతృత్వంలోని దక్షిణాఫ్రికా ఇప్పటివరకు ఆడిన 11 టెస్ట్ మ్యాచ్‌లలో 10 గెలిచి 1 డ్రాగా ముగిసింది. అంటే బావుమా మొదటి 11 మ్యాచ్‌లలో ఓటమిని రుచి చూడలేదు. తద్వారా, అజేయ కెప్టెన్‌గా తన మొదటి 10 టెస్ట్ మ్యాచ్‌లను గెలిచిన ప్రపంచంలోనే ఏకైక కెప్టెన్‌గా టెంబా బావుమా ప్రపంచ రికార్డు సృష్టించాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




