IND vs SA, 2nd Test, Day 1, Highlights: భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మొదటి రోజు ఆట ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా 202 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంబించిన సౌతాప్రికా ఒక వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది. దీంతో ఇప్పటివరకు సౌతాఫ్రికా.. భారత్ కంటే 167 పరుగులు వెనుకబడి ఉంది. క్రీజులో డీన్ ఎల్గర్ 11 పరుగులు, పీటర్సన్ 14 పరుగులు నాటౌట్‌గా ఉన్నారు. కాగా భారత బౌలర్లలో మహమ్మద్ షమికి ఒక వికెట్ దక్కింది.
అంతకు ముందు మొదటగా బ్యాటింగ్ చేపట్టిన ఇండియాకి ఓపెనర్లు శుభారంభాన్నిచ్చారు. 36 పరుగుల వద్ద తొలి వికెట్ పడింది. మయాంక్ అగర్వాల్ 26 పరుగులకు ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన పుజారా 3 పరుగులకే వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన అజింకా రహానె డకౌట్ అయ్యాడు. పీకల్లోతు కష్టాల్లో పడిన భారత్‌ని కెప్టెన్ కెఎల్.రాహుల్ హాఫ్ సెంచరీతో గట్టెక్కించాడు. 128 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 50 పరుగులు చేశాడు.
1-0 ఆధిక్యంలో భారత్.. సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ 113 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో 3 టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.
జోహన్నెస్‌బర్గ్‌లో భారత్ రికార్డు అదుర్స్.. జోహన్నెస్‌బర్గ్ మైదానం దక్షిణాఫ్రికాలో భారతదేశానికి బలమైన కోటగా నిలిచింది. ఇక్కడ ఒక్క టెస్టులోనూ టీమిండియా ఓడిపోలేదు. అదే రికార్డును కొనసాగించాలని భారత్ ఆశపడుతోంది.
ప్లేయింగ్ XI: దక్షిణాఫ్రికా: డీన్ ఎల్గర్ (కెప్టెన్), ఐడెన్ మార్క్రామ్, కీగన్ పీటర్సన్, రాస్సీ వాన్ డెర్ డుసెన్, టెంబా బావుమా, కైల్ వెర్రెయిన్ (కీపర్), మార్కో జాన్సెన్, కగిసో రబడ, కేశవ్ మహరాజ్, డువాన్ ఒలివియర్, లుంగి ఎన్గిడి
భారత్: కేఎల్ రాహుల్(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, ఛెతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే, హనుమ విహారి, రిషబ్ పంత్(కీపర్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మొదటి రోజు ఆట ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా 202 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంబించిన సౌతాప్రికా ఒక వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది. దీంతో ఇప్పటివరకు సౌతాఫ్రికా.. భారత్ కంటే 167 పరుగులు వెనుకబడి ఉంది. క్రీజులో డీన్ ఎల్గర్ 11 పరుగులు, పీటర్సన్ 14 పరుగులు నాటౌట్‌గా ఉన్నారు.
సౌతాఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది. 7 పరుగుల వద్ద ఓపెనర్ మార్‌క్రమ్ ఔటయ్యాడు. మహమ్మద్ షమి బౌలింగ్‌లో ఎల్బీడబ్లుగా వెనుదిరిగాడు. క్రీజులోకి పీటర్సన్ వచ్చాడు. దీంతో సౌతాఫ్రికా ఒక వికెట్ నష్టానికి 14 పరుగులు చేసింది.
భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌లో మొదటి రోజు భారత్ 202 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం సౌతాఫ్రికా బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్లుగా డీన్ ఎల్గర్, మార్క్రమ్ క్రీజులోకి వచ్చారు.
భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌లో మొదటి రోజు భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టింది. కానీ ఆశించినంతగా రాణించలేదు. 63.1 ఓవర్లోలో 202 పరుగులకు ఆలౌట్ అయింది. మొదటి రోజు సౌతాఫ్రికా హవానే నడిచిందని చెప్పాలి. సఫారీల బౌలర్ల ముందు భారత్ ఆటగాళ్లు నిలువలేకపోయారు. వరుసగా వికెట్లు చేజార్చుకున్నారు. కెప్టెన్ కెఎల్. రాహుల్ ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. ఆశ్విన్ 46 పరుగులు మినహాయించి మిగతా వారెవ్వరు చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు. దీంతో 202 పరుగులకు ఆలౌట్ అయింది. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కోజాన్సన్ నాలుగు వికెట్లు, ఓలివర్ మూడు వికెట్లు, కాగిసో రబడ మూడు వికెట్లు సాధించారు.
భారత్ 61.5 ఓవర్లలో 200 పరుగులు దాటింది. సిరాజ్ 0 పరుగులు, బుమ్రా 14 పరుగులతో ఆడుతున్నారు. దీంతో ఇండియా 9 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కోజాన్సన్ నాలుగు వికెట్లు, ఓలివర్ మూడు వికెట్లు, కాగిసో రబడ రెండు వికెట్లు సాధించారు.
భారత్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. రవిచంద్రన్ అశ్విన్ 46 పరుగుల వద్ద ఔటయ్యాడు. జాన్సన్ బౌలింగ్‌లో పీటర్సన్ క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. దీంతో ఇండియా 9 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కోజాన్సన్ నాలుగు వికెట్లు, ఓలివర్ మూడు వికెట్లు, కాగిసో రబడ రెండు వికెట్లు సాధించారు. క్రీజులోకి మహ్మద్ సిరాజ్ వచ్చాడు.
భారత్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. మహ్మద్ షమి 9 పరుగులకు ఔటయ్యాడు. రబాడా బౌలింగ్‌లో వెనుదిరిగాడు. దీంతో ఇండియా 8 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కోజాన్సన్ మూడు వికెట్లు, ఓలివర్ మూడు వికెట్లు, కాగిసో రబడ రెండు వికెట్లు సాధించారు. క్రీజులోకి బుమ్రా వచ్చాడు.
భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. శార్దుల్ ఠాకూర్ డకౌట్ అయ్యాడు. ఓలివర్ బౌలింగ్‌లో పీటర్సన్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో ఇండియా 7 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. క్రీజులోకి మహ్మద్ షమీ వచ్చాడు.
భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. రిషబ్ పంత్ 17 పరుగులకు ఔటయ్యాడు. జాన్సన్ బౌలింగ్‌లో వెరియన్ క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. దీంతో ఇండియా 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. శార్దుల్ ఠాకూర్ క్రీజులోకి వచ్చాడు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కోజాన్సన్ మూడు వికెట్లు, ఓలివర్ రెండు వికెట్లు, కాగిసో రబడ ఒక వికెట్ సాధించారు.
భారత్ 53.2 ఓవర్లలో 150 పరుగులు దాటింది. రిషబ్ పంత్17 పరుగులు, రవిచంద్రన్ అశ్విన్ 26 పరుగులతో ఆడుతున్నారు. దీంతో ఇండియా 5 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కోజాన్సన్ రెండు వికెట్లు, ఓలివర్ రెండు వికెట్లు, కాగిసో రబడ ఒక వికెట్ సాధించారు.
భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌లో మొదటి రోజు రెండో సెషన్ ముగిసింది. భారత్ 51 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 146 పరుగులు చేసింది. క్రీజులో రిషబ్ పంత్ 13 పరుగులు, అశ్విన్ 24 పరుగులతో ఆడుతున్నారు. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 36 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ మయాంక్ అగర్వాలో 26 పరుగలు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన పుజారా, అజింకా రహానె విఫలమయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కోజాన్సన్ రెండు వికెట్లు, ఓలివర్ రెండు వికెట్లు, కాగిసో రబడ ఒక వికెట్ సాధించారు.
భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ కెఎల్. రాహుల్ 50 పరుగులకు ఔటయ్యాడు. జాన్సన్ బౌలింగ్‌లో రబాడా అద్భుత క్యాచ్ పట్టాడు. దీంతో తీవ్ర నిరాశతో వెనుదిరిగాడు. ఇండియా 5 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. క్రీజులోకి రవిచంద్రన్ అశ్విన్ వచ్చాడు.
కెప్టెన్ కెఎల్. రాహుల్ హాఫ్ సెంచరీ సాధించాడు. 128 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 50 పరుగులు చేశాడు. దీంతో భారత్ 4 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. అతనికి తోడుగా క్రీజులో రిషబ్ పంత్ 12 పరుగులతో ఆటను కొనసాగిస్తున్నాడు. కాగా ఇది రాహుల్‌కి 13వ హాఫ్ సెంచరీ..
భారత్ 40.5 ఓవర్లలో 100 పరుగులు దాటింది. కెఎల్. రాహుల్ 42 పరుగులు, రిషబ్ పంత్ 8 పరుగులతో ఆడుతున్నారు. దీంతో ఇండియా 4 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కోజాన్సన్ ఒక వికెట్, కాగిసో రబడ ఒక వికెట్, ఓలివర్ రెండు వికెట్లు సాధించారు.
భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. హనుమ విహారి 20 పరుగుల వద్ద ఔటయ్యాడు. రబాడ బౌలింగ్‌లో వాన్ డుస్సెన్ అద్భుత క్యాచ్ పట్టాడు. దీంతో ఇండియ 4 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. క్రీజులోకి రిషబ్ పంత్ వచ్చాడు.
భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌లో మొదటి రోజు తొలి సెషన్ ముగిసింది. ఇందులో సౌతాఫ్రికానే పై చేయి సాధించింది. భారత్ 26 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 53 పరుగులు మాత్రమే చేసింది. క్రీజులో కెప్టెన్ కెఎల్. రాహుల్ 19 పరుగులు, హనుమ విహారి 4 పరుగులతో ఉన్నారు. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 36 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ మయాంక్ అగర్వాలో 26 పరుగలు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన పుజారా, అజింకా రహానె విఫలమయ్యారు. దీంతో భారత్ యాబై పరుగుల లోపే 3 వికెట్లు కోల్పోయింది. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కోజాన్సన్ ఒక వికెట్, ఓలివర్ రెండు వికెట్లు సాధించారు.
భారత్ 24.1 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 50 పరుగులు చేసింది. కెఎల్. రాహుల్ 19 పరుగులు, హనుమ విహారి 1 పరుగులతో ఆట కొనసాగిస్తున్నారు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కోజాన్సన్ ఒక వికెట్, ఓలివర్ రెండు వికెట్లు సాధించారు.
భారత్ 49 పరుగుల వద్ద మరో వికెట్ కోల్పోయింది. ఓలివర్ బౌలింగ్‌లో అజింకా రహానె డకౌట్ అయ్యాడు. కీగన్ పీటర్సన్ క్యాచ్ తీసుకోవడంతో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. వెనువెంటనే రెండు వికెట్లు కోల్పోవడంతో భారత్ కష్టాల్లో పడింది. క్రీజులోకి హనుమవిహారి వచ్చాడు.
భారత్ రెండో వికెట్ కోల్పోయింది. చటేశ్వరా పుజారా కేవలం 3 పరుగులకే ఔటయ్యాడు. ఓలివర్ బౌలింగ్‌లో బావుమా సూపర్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో భారత్ 2 వికెట్ల నష్టానికి 49 పరుగులు చేసింది.
సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 36 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. మయాంక్ అగర్వాల్ 26 పరుగులకు ఔటయ్యాడు. మార్కోజాన్సన్ బౌలింగ్‌లో వెరియానే క్యాచ్ పట్టాడు. క్రీజులోకి చటేశ్వారా పుజారా వచ్చాడు.
కెఎల్. రాహుల్‌కి లైఫ్ దొరికినట్లయింది. ఓలీవర్ బౌలింగ్‌లో బంతి శబ్దం చేస్తూ వికెట్ కీపర్ చేతిలో పడింది. దీంతో సౌతాఫ్రికా రివ్యూకి వెళ్లింది. కానీ బంతి రాహుల్ బుజాల అంచున తాకుతూ వెళ్లింది. దీంతో అంపైర్ నాటౌట్ ప్రకటించాడు. మయాంక్ 18 పరుగులు, రాహుల్ 9 పరుగులతో ఆడుతున్నారు.
భారత ఓపెనర్ మయాంక్ అగర్వాల్ బౌండరీలతో తన దూకుడు చూపిస్తున్నాడు. ఇప్పటి వరకు భారత ఇన్నింగ్స్‌లో వచ్చిన బౌండరీలన్నీ మయాంక్ కొట్టినవే కావడం విశేషం. 19 బంతులు ఆడిన మయాంక్ 4 ఫోర్లతో 19 పరుగులు చేశాడు. మరోవైపు రాహుల్ 26 బంతులు ఆడి కేవలం 1 పరుగు మాత్రమే చేశాడు.
టీమ్ ఇండియా 5 ఓవర్లు ముగిసేసరికి 15 పరుగులతో ఆడుతుంది. మయాంక్ 13 పరుగులు కొంచెం వేగంగా ఆడుతున్నాడు. రాహుల్ ఒక పరుగుతో కొనసాగుతున్నాడు.
టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ బరిలోకి దిగారు. వెన్నునొప్పితో రెగ్యులర్ సారథి విరాట్ కోహ్లీ ఈ టెస్ట్ నుంచి తప్పుకున్నాడు. దీంతో జోహెన్నెస్‌బర్గ్ టెస్టుకు కేఎల్ రాహుల్ నాయకత్వం వహిస్తున్నాడు.
దురదృష్టవశాత్తూ విరాట్‌కు వెన్ను పైభాగంలో నొప్పి తీవ్రమైంది. ఫిజియోల నిర్ణయం మేరకు కోహ్లీ రెండో టెస్టులో ాడడం లేదు. మూడో టెస్టు వరకు కోలుకుంటాడని ఆశిస్తున్నాను. తన దేశానికి కెప్టెన్‌గా నిలవడం ప్రతి భారత ఆటగాడి కల. నిజంగా ఇది గౌరవం. ఈ సవాలు కోసం ఎదురు చూస్తున్నాను. మేం ఇక్కడ కొన్ని మంచి విజయాలు సాధించాం. దానిని కొనసాగించాలని ఆశిస్తున్నాం. విరాట్ స్థానంలో హనుమ విహారి జట్టులోకి వచ్చాడు.
భారత జట్టు (ప్లేయింగ్ XI): కేఎల్ రాహుల్(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, ఛెతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే, హనుమ విహారి, రిషబ్ పంత్(కీపర్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): డీన్ ఎల్గర్ (కెప్టెన్), ఐడెన్ మార్క్రామ్, కీగన్ పీటర్సన్, రాస్సీ వాన్ డెర్ డుసెన్, టెంబా బావుమా, కైల్ వెర్రెయిన్ (కీపర్), మార్కో జాన్సెన్, కగిసో రబడ, కేశవ్ మహరాజ్, డువాన్ ఒలివియర్, లుంగి ఎన్గిడి
జోహన్నెస్‌బర్గ్ టెస్టులో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత దక్షిణాఫ్రికా బౌలింగ్ చేయనుంది.
భారత రెగ్యులర్ టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండో టెస్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో కేఎల్ రాహుల్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
Published On - Jan 03,2022 12:58 PM