IND Vs SA: ఏందీ సామీ ఈ ఊచకోత..! 23 సిక్సర్లు కొట్టినా ప్రపంచ రికార్డు బద్దలవ్వలేదు.. ఎందుకంటే

జోహన్నెస్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి టీ20లో టీమిండియా బ్యాటర్లు శివతాండవం ఆడారు. ఫోర్లు, సిక్సర్లతో ఊహకందని ఊచకోత కోయడమే కాదు.. సఫారీలపై సిరీస్ విజయం అందుకున్నారు.

IND Vs SA: ఏందీ సామీ ఈ ఊచకోత..! 23 సిక్సర్లు కొట్టినా ప్రపంచ రికార్డు బద్దలవ్వలేదు.. ఎందుకంటే
Ind Vs Sa
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 16, 2024 | 10:52 AM

జోహన్నెస్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి టీ20లో టీమిండియా బ్యాటర్లు శివతాండవం ఆడారు. ఫోర్లు, సిక్సర్లతో ఊహకందని ఊచకోత కోయడమే కాదు.. సఫారీలపై సిరీస్ విజయం అందుకున్నారు. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ ఇండియాకు.. అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, తిలక్ వర్మ మెరుపు బ్యాటింగ్‌తో భారీ స్కోర్ అందించారు.

ఇది చదవండి: మీరు పుట్టిన తేదీని బట్టి మీ వెనకున్న దేవుడెవరో చెప్పొచ్చు.! ఎలాగో తెల్సా

ఇవి కూడా చదవండి

తొలి ఓవర్ నుంచి మొదలైన వీరి విధ్వంసం.. చివరి బంతి వరకు కొనసాగింది. మొదట్లో అభిషేక్ శర్మ(36) 4 సిక్సర్లు కొట్టగా, ఆ తర్వాత సంజూ శాంసన్(9), తిలక్ వర్మ(10) సిక్సర్లతో విరుచుకుపడ్డారు. 56 బంతులు ఎదుర్కొన్న సంజూ శాంసన్ 9 సిక్సర్లు, 6 ఫోర్లతో 109 పరుగులు చేయగా.. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ తిలక్ వర్మ 47 బంతుల్లో 10 సిక్సర్లు, 9 ఫోర్లతో 120 పరుగులు కొట్టాడు. దీనితో టీమిండియా బ్యాటర్లు మొత్తంగా 23 సిక్సర్లు బాదారు. భారత్‌కు ఇది రికార్డు అయినప్పటికీ.. తృటిలో ప్రపంచ రికార్డు మిస్ అయింది. కేవలం 4 సిక్సర్లతో టీమిండియా ఈ రికార్డును కోల్పోయింది.

ఇది చదవండి: తస్సాదియ్యా.! పే..ద్ద టాస్కే ఇది.. పామును గుర్తిస్తే మీరే తెలివైనవారే

టీ20లలో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్రపంచ రికార్డును జింబాబ్వే సొంతం చేసుకుంది. 2024లో గాంబియాతో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే బ్యాట్స్‌మెన్లు 27 సిక్సర్లు కొట్టి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఇప్పుడు ఈ జాబితాలో 23 సిక్సర్లతో భారత్ మూడో స్థానంలో నిలిచింది. టీ20 క్రికెట్ మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు జాబితాలో 26 సిక్సర్లతో నేపాల్ రెండో స్థానంలో ఉంది.

ఇది చదవండి: బాబోయ్.. అది రోడ్డు కాదు భారీ కొండచిలువ.. పట్టు జారితే పరలోకానికే

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..