IND vs SA: డివిలియర్స్, కోహ్లీ కాదు బౌలర్లు అందరూ అతనికి భయపడతారు: క్లాసెన్

|

Nov 13, 2024 | 6:34 PM

దక్షిణాఫ్రికా బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్, టీ20 ఫార్మాట్‌లో గోట్ (గ్రీటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) గా సూర్యకుమార్ యాదవ్‌ను అభివర్ణించాడు. జియో సినిమాతో ఇంటర్వ్యూలో మాట్లాడిన క్లాసెన్, సూర్య శైలి విభిన్నంగా ఉంటుందని.. షాట్ల ఆడేవిధంగా ఆకర్షణీయంగా ఉంటుందన్నాడు. ఇక సూర్య ఫైన్ లెగ్ మీద ఆడే షాట్ గురించి ప్రస్తావించాడు క్లాసెన్.

IND vs SA: డివిలియర్స్, కోహ్లీ కాదు బౌలర్లు అందరూ అతనికి భయపడతారు: క్లాసెన్
Sky
Follow us on

 

ఆధునిక టీ20 క్రికెట్‌లో అత్యుత్తమ టీ20 బ్యాట్స్‌మెన్‌లలో దక్షిణాఫ్రికా ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ ఒకడు. వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ అయిన క్లాసెన్ ధనాధన్ బ్యాటింగ్ చేయడంలో దిట్ట. మిడిలార్డర్‌లో బ్యాట్స్‌మెన్‌గా ఆడుతున్న క్లాసెన్ ప్రస్తుతం భారత సిరీస్‌లో మంచి ఫామ్‌లో ఉన్నప్పటికీ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. వచ్చే రెండు మ్యాచ్‌లలో క్లాసెన్ నుంచి మంచి ఇన్నింగ్స్ ను ఆశించవచ్చు. కాగా ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ క్లాసన్ ను అత్యధిక ధరకు రిటైన్ చేసుకుంది. క్లాసెన్ గత సీజన్ లో SRH తరఫున అదరగొట్టాడు.

 

తాజాగా జియో సినిమాతో జరిగిన ఇంటర్వ్యూలో క్లాసెన్ మాట్లాడుతూ టీ20 లో డెంజరేస్ బ్యాట్స్మెన్ ఎవరో చెప్పాడు. ఎవరిని టీ20 ఫార్మాట్‌లో గోట్ (గ్రీటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) గా భావిస్తారో అని ప్రశ్నించగా, క్లాసెన్ ఎలాంటి సందేహం లేకుండా భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పేరును చెప్పాడు. “నా అభిప్రాయం ప్రకారం SKY  (సూర్యకుమార్ యాదవ్) మంచి ఆప్షన్ అవుతాడు” అని  పేర్కొన్నాడు. సూర్యకుమార్ ఆడే ఒక ప్రత్యేక షాట్ తనకు ఎప్పుడూ ఆసక్తిగా ఉంటుందని, కానీ ఆ షాట్ ఆడే విషయంలో వెనకడుగు వేస్తానన్నాడు. “సూర్య ఆడే ఫైన్ లెగ్ మీద షాట్ నన్ను ఎప్పుడూ ఆకర్షిస్తుంది, అని చెప్పాడు క్లాసెన్.

 

ప్రస్తుతం అత్యుత్తమ టీ20 బ్యాట్స్‌మెన్‌లలో సూర్యకుమార్ యాదవ్ ఒకడు. 150 ప్లస్ స్ట్రయిక్ రేట్ తో బ్యాటింగ్ చేయడం సూర్యకు క్యాట్ వాక్ చేసినంత ఈజీ.  డివిలియర్స్ మాదిరిగానే  సూర్యకుమార్ యాదవ్ కూడా 360-డిగ్రీల్లో షాట్స్ అడగలిగే సామర్థ్యం కలవాడు. టీ20ల్లో ఎలాంటి బౌలర్‌నైనా నిర్భయంగా ఎదురుకోగల సత్తా సూర్యకు ఉంది. అంతే కాదు టీమిండియా టీ20 కెప్టెన్సీ అయిన తర్వాత కూడా సూర్య తన బ్యాటింగ్ పవర్ తగ్గలేదన్న విషయం ఇక్కడ గమనించాలి.

 

టీ20 ఫార్మాట్ లో సూర్యకుమార్ యాదవ్ గణాంకాలు అద్భుతంగా ఉన్నాయి. హిట్టింగ్ చేసే ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్ లా నిలకడగా ఆడటం చాలా అరుదు. ఐపీఎల్‌లో చాలా కాలంగా అదరగోడుతున్న సూర్య 2021లో భారత జట్టులోకి అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు 76 మ్యాచ్‌ల్లో 168కి పైన స్ట్రైక్ రేట్ తో 2569 పరుగులు చేశాడు. 2024 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ కు టైటిల్ అందించడంలో సూర్య పట్టిన క్యాచ్ టర్నింగ్ పాయింట్ అయింది. బౌండరీ లైన్ దగ్గర సూర్యకుమార్ యాదవ్ పట్టిన అద్భుత క్యాచ్ భారత్‌కు టైటిల్ అందేలా చేసింది.

 

రోహిత్ శర్మ T20 నుండి రిటైర్ అయిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ భారత T20 కెప్టెన్సీని పగ్గాలు చేపట్టాడు. సూర్య నాయకత్వంలో టీమిండియా‌ మంచి ప్రదర్శన చేస్తోంది. శ్రీలంకలో టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత్.. దక్షిణాఫ్రికాలో కూడా అదే ఫీట్‌ను పునరావృతం చేసేందుకు ప్రయత్నిస్తోంది. తొలి మ్యాచ్‌లో 61 పరుగుల తేడాతో గెలిచిన భారత్ రెండో మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ ప్రస్తుతం 1-1తో సమమైంది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భారత్ ప్రయత్నిస్తోంది.