జోహన్నెస్‌బర్గ్ వేదికగా ఆదివారం (డిసెంబర్ 17) దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేసి 5 వికెట్లు పడగొట్టాడు. తద్వారా టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడీ లెఫ్టార్మ్ సీమర్. తన కెరీర్‌లో ఐదు వికెట్లు తీయడం అర్ష్‌దీప్ సింగ్ కు ఇదే మొదటిసారి. అలాగే దక్షిణాఫ్రికాతో జరిగిన ఓ వన్డే మ్యాచ్‌లో 5 వికెట్లు తీసిన ఏకైక భారత ఫాస్ట్ బౌలర్‌గా అర్షదీప్ నిలిచాడు. ఈ మ్యాచ్‌లో అర్షదీప్ 10 ఓవర్లు బౌలింగ్ చేసి 37 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్‌తో పాటు అవేష్ ఖాన్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు పడగొట్టాడు. తద్వారా దక్షిణాఫ్రికాలో 5 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన మూడో భారత బౌలర్‌గా అర్షదీప్ నిలిచాడు. అర్షదీప్ కంటే ముందు ఆశిష్ నెహ్రా 2003 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై 6 వికెట్లు తీయగా, యుజువేంద్ర చాహల్ 2018లో సెంచూరియన్‌లో ఆఫ్రికా జట్టుపై 5 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ అర్షదీప్, అవేశ్ విధ్వంసం సృష్టించి ఆఫ్రికన్ బ్యాట్స్‌మెన్‌లను మట్టికరిపించారు.
భారత బౌలర్లిద్దరూ ఆరంభం నుంచే ప్రమాదకరంగా బౌలింగ్ చేసి ఆఫ్రికా జట్టు మొత్తాన్ని 116 పరుగులకే ఆలౌట్ చేశారు. భారత్ తరఫున అర్షదీప్ 5, అవేశ్ ఖాన్ 4, కుల్దీప్ యాదవ్ 1 వికెట్ తీశారు. అనంతరం ఈ స్వల్ప లక్ష్యాన్ని భారత్ కేవలం 17 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అరంగేట్ర ఆటగాడు సాయి సుదర్శన్ 55 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 52 పరుగులతో రాణించారు. ఈ మ్యాచ్‌లో 8 వికెట్లతేడాతో విజయం సాధించిన రాహుల్ సేన మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఐదు వికెట్లతో దక్షిణాఫ్రికాను కుప్పకూల్చిన అర్ష్ దీప్ సింగ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
Congratulations Team India on their win in the first ODI against South Africa! @arshdeepsinghh secured 5 wickets in a stellar performance and debutant @sais_1509’s fabulous 50, played a pivotal role in the team’s victory! @BCCI pic.twitter.com/cUl5JtzvLE
— Jay Shah (@JayShah) December 17, 2023
Arshdeep Singh won the Player of the match award for his terrific bowling performance. 🫡 pic.twitter.com/AelXQv8YoP
— Johns. (@CricCrazyJohns) December 17, 2023
మరిన్ని క్రీడా వార్తల గురించి ఇక్కడ క్లిక్ చేయండి..