IND VS SA, 4th T20I: సఫారీలతో నాలుగో టీ 20 మ్యాచ్‌.. టీమిండియా ఆటగాళ్లను ఊరిస్తున్న రికార్డులివే..

|

Jun 17, 2022 | 9:22 AM

IND VS SA, 4th T20I: ఢిల్లీ, కటక్‌లలో ఖంగుతున్న టీమిండియా విశాఖపట్నంలో మాత్రం విజయ ఢంకా మోగించింది. చావో రేవో తెలుసుకోవాల్సిన మ్యాచ్‌లో సమిష్ఠిగా రాణించి 48 పరుగుల తేడాతో విజయం సాధించింది..

IND VS SA, 4th T20I: సఫారీలతో నాలుగో టీ 20 మ్యాచ్‌.. టీమిండియా ఆటగాళ్లను ఊరిస్తున్న రికార్డులివే..
Indian Cricket Team
Follow us on

IND VS SA, 4th T20I: ఢిల్లీ, కటక్‌లలో ఖంగుతున్న టీమిండియా విశాఖపట్నంలో మాత్రం విజయ ఢంకా మోగించింది. చావో రేవో తెలుసుకోవాల్సిన మ్యాచ్‌లో సమిష్ఠిగా రాణించి 48 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో దక్షిణాఫ్రికా ఆధిక్యాన్ని 2-1కితగ్గించింది. ఈ క్రమంలో నేడు (జూన్‌ 17) రాజ్‌కోట్‌ వేదికగా 4వ టీ20 మ్యాచ్ జరగనుంది. సిరీస్‌ను కోల్పోకూడదంటే ఈమ్యాచ్‌లోనూ భారత జట్టు గెలవాల్సి ఉంది. కాగా నాలుగో టీ20 మ్యాచ్‌కు ముందు టీమిండియా ప్లేయర్లను కొన్ని రికార్డులు ఊరిస్తున్నాయి. అవేంటో తెలుసుకుందాం రండి..

మరో సిక్సర్‌ బాదితే..

కాగా ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌ రిషబ్ పంత్ మరో సిక్సర్ బాదితే అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో చేరతాడు. ఇక టీమిండియా వెటరన్‌ ప్లేయర్‌ దినేశ్‌ కార్తీక్‌ మరో 64 పరుగులు చేస్తే అంతర్జాతీయ టీ20ల్లో 500 పరుగులను పూర్తి చేసుకుంటాడు. ఇక స్వింగ్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ మరో 4 వికెట్లు తీస్తే అంతర్జాతీయ టీ20ల్లో భారత్‌ తరపున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా రికార్డుల్లోకెక్కనున్నాడు. ఇక లెఫ్టార్మ్ స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ మరొ వికెట్‌ తీస్తే టీ 20 ఫార్మాట్లో 100 వికెట్ల మైలురాయిని చేరుకుంటాడు. మరి ఎవరెవరు తమ రికార్డులు అందుకుంటారో నేటి మ్యాచ్‌లో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..