AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA : చేతులెత్తేసిన బ్యాటర్లు.. టీమిండియాను 408 పరుగుల తేడాతో చిత్తు చేసిన సౌతాఫ్రికా

భారత్, సౌతాఫ్రికా మధ్య జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఆతిథ్య టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది. గౌహతిలో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ ఐదో రోజుకు చేరుకున్నప్పటికీ ఫలితం మాత్రం సౌతాఫ్రికాకు అనుకూలంగా వచ్చింది. ఈ మ్యాచ్‌లో భారత్‌పై సౌతాఫ్రికా 408 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.

IND vs SA : చేతులెత్తేసిన బ్యాటర్లు.. టీమిండియాను 408 పరుగుల తేడాతో చిత్తు చేసిన సౌతాఫ్రికా
Ind Vs Sa 2nd Test
Rakesh
|

Updated on: Nov 26, 2025 | 12:50 PM

Share

IND vs SA : భారత్, సౌతాఫ్రికా మధ్య జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఆతిథ్య టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది. గౌహతిలో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ ఐదో రోజుకు చేరుకున్నప్పటికీ ఫలితం మాత్రం సౌతాఫ్రికాకు అనుకూలంగా వచ్చింది. ఈ మ్యాచ్‌లో భారత్‌పై సౌతాఫ్రికా 408 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. దీనితో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 2-0 తేడాతో గెలిచి సఫారీలు టీమిండియాను క్లీన్ స్వీప్ చేశారు.

ఈ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్‌లకు సౌతాఫ్రికా స్పిన్నర్లు చుక్కలు చూపించారు.భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా బ్యాటింగ్ లైనప్ దారుణంగా కుప్పకూలింది. సౌతాఫ్రికా మొదటి ఇన్నింగ్స్‌లో 489 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లకు 260 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 201 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక 550 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్, కేవలం 140 పరుగులకే ఆలౌట్ అయ్యి ఘోర పరాజయాన్ని చవిచూసింది.

మొదటి ఇన్నింగ్స్‌లో మార్కో జాన్సెన్ 6 వికెట్లు తీయగా, రెండో ఇన్నింగ్స్‌లో స్పిన్నర్ సైమన్ హార్మర్ 6 వికెట్లు తీసి భారత ఓటమికి ప్రధాన కారణమయ్యారు. ఐదో రోజు ఆటలో భారత్ ఓటమిని తప్పించుకోవడానికి డ్రా చేయడమే ఏకైక మార్గం. కానీ టీమిండియా బ్యాట్స్‌మెన్లలో ఆ పోరాట పటిమ కనిపించలేదు. కెప్టెన్ రిషబ్ పంత్ రెండు ఇన్నింగ్స్‌లలోనూ విఫలమయ్యాడు. ఐదో రోజు ప్రారంభంలోనే టీమిండియా ధ్రువ్ జురెల్, పంత్ వికెట్లు కోల్పోయింది. అలాగే నిన్నటి నుంచి నిలకడగా ఆడుతున్న సాయి సుదర్శన్ (139 బంతుల్లో 14) కూడా తక్కువ స్కోరుకే అవుటయ్యాడు.

ఓటమి ఖాయమైన సమయంలో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 78 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 54 పరుగుల హాఫ్ సెంచరీ చేసి ఒంటరి పోరాటం చేశాడు. అయినప్పటికీ భారత్ రెండో ఇన్నింగ్స్ 140 పరుగులకే ముగియడంతో 408 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ ఓటమి కారణంగా గత మూడు టెస్ట్ సిరీస్‌లలో భారత్‌కు ఇది రెండో క్లీన్ స్వీప్ కావడం గమనార్హం. సౌతాఫ్రికా బౌలర్ల నిలకడైన ప్రదర్శన, ముఖ్యంగా స్పిన్ బౌలింగ్‌లో వాళ్ళు చూపిన పట్టుదల, భారత్‌ను సిరీస్‌లో దారుణంగా దెబ్బతీసింది. ఈ మ్యాచ్‌లో భారత్ డ్రా చేసుకునే అవకాశం ఉన్నా, క్రీజులో నిలబడాల్సిన బ్యాట్స్‌మెన్ త్వరగా అవుట్ కావడంతో ఆ అవకాశం కూడా దక్కలేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..