IND vs SA 2nd T20I Preview: మొహాలీలో కింగ్ ఎవరు.. పిచ్ రిపోర్ట్‌తో టెన్షన్‌లో ఇరుజట్లు..?
IND vs SA 2nd T20I: ఐపీఎల్ టోర్నమెంట్‌లో ఈ మైదానంలో ఆరు మ్యాచ్‌లు జరిగాయి. సగటు మొదటి ఇన్నింగ్స్ స్కోరు 170 పరుగులు కాగా, సగటు రెండవ ఇన్నింగ్స్ స్కోరు 154 పరుగులుగా నిలిచింది. ఈ మైదానంలో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయడం ప్రయోజనకరంగా ఉంది.

IND vs SA: భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య రెండవ T20I చండీగఢ్‌లోని మొహాలీలో జరుగుతుంది. భారత జట్టు మొదటి T20Iలో దక్షిణాఫ్రికాను 101 పరుగుల భారీ తేడాతో ఓడించి 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్‌లో తిరిగి విజయం సాధించాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌కు సంబంధించి పిచ్, టాస్, వాతావరణ పరిస్థితులను ఓసారి చూద్దాం..
IND vs SA 2వ T20 ఎక్కడ, ఎప్పుడు జరుగుతుందంటే:
మ్యాచ్: ఇండియా vs దక్షిణాఫ్రికా
స్టేడియం: మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, ముల్లన్పూర్, మొహాలి.
మ్యాచ్ తేదీ: డిసెంబర్ 11, 2025 (సాయంత్రం 07:00)
ప్రత్యక్ష ప్రసారం (భారతదేశంలో): స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్, డీడీ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లలో చూడొచ్చు.
హెడ్-టు-హెడ్ గణాంకాలు:
ఇరుజట్ల మద్య మొత్తం 10 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో భారత్ 6 మ్యాచ్‌ల్లో గెలవగా, దక్షిణాఫ్రికా 4 మ్యాచ్‌లు గెలిచింది. ఇక గత 5 మ్యాచ్‌ల్లో భారత జట్టు 4 గెలవగా, దక్షిణాఫ్రికా 1 మ్యాచ్ గెలిచింది.
మహారాజా యదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం పిచ్ నివేదిక:
మొహాలీలోని ముల్లన్‌పూర్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఇప్పటివరకు 2 ODIలు మాత్రమే జరిగాయి. మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ సులభంగా కనిపించింది.
ఐపీఎల్ టోర్నమెంట్‌లో ఈ మైదానంలో ఆరు మ్యాచ్‌లు జరిగాయి. సగటు మొదటి ఇన్నింగ్స్ స్కోరు 170 పరుగులు కాగా, సగటు రెండవ ఇన్నింగ్స్ స్కోరు 154 పరుగులుగా నిలిచింది. ఈ మైదానంలో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయడం ప్రయోజనకరంగా ఉంది.
IND vs SA 2వ T20I అంచనా: ఎవరు ఎక్కువ పరుగులు చేస్తారు?
హార్దిక్ పాండ్యా : గత మ్యాచ్‌లో అతను 59 పరుగులతో అత్యధిక స్కోరు సాధించాడు. ఈ మ్యాచ్‌లో కూడా 30 నుంచి 40 పరుగులు చేయగలడు.
అభిషేక్ శర్మ: అతను భారత జట్టు ఓపెనింగ్ బ్యాట్స్‌మన్. అతను ఈ మైదానంలో చాలా మ్యాచ్‌లు ఆడాడు. గత మ్యాచ్‌లో 17 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో అతను భారీ ఇన్నింగ్స్ ఆడగలడు.
IND vs SA 2వ T20I అంచనా: ఎవరు ఎక్కువ వికెట్లు తీస్తారు?
లుంగి న్గిడి : గత మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసిన దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్, ఈ మ్యాచ్‌లో కూడా ఒకటి లేదా రెండు వికెట్లు తీయవచ్చు.
అర్ష్‌దీప్ సింగ్ : అతను ఈ మైదానంలో చాలా మ్యాచ్‌లు ఆడాడు. గత మ్యాచ్‌లో అతను రెండు వికెట్లు తీసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా అతను రెండు నుంచి మూడు వికెట్లు తీయగలడు.
IND vs SA 2వ T20I అంచనా: ఏ జట్టు గెలుస్తుంది?
రెండో టీ20 మ్యాచ్‌లో కూడా భారత జట్టు విజయం సాధించవచ్చు. భారత బౌలర్లు దక్షిణాఫ్రికా కంటే చాలా బాగా బౌలింగ్ చేశారు. ఈ మ్యాచ్‌లో కూడా వారు తమ ప్రదర్శనను పునరావృతం చేయవచ్చు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ పేలవమైన ఫామ్‌లో ఉండటం టీమ్ ఇండియాకు ఆందోళన కలిగిస్తుంది. మరోవైపు, దక్షిణాఫ్రికా కూడా తమ బ్యాట్స్‌మెన్స్ నుంచి మెరుగైన ప్రదర్శనను ఆశిస్తుంది.
IND vs SA 2వ T20I ప్రాబబుల్ ప్లేయింగ్ XI:
భారత్ : అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, జితేష్ శర్మ (వికెట్ కీపర్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, అర్షదీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా.
దక్షిణాఫ్రికా : క్వింటన్ డి కాక్ (కీపర్), డొనవన్ ఫెరీరా, ఐడెన్ మార్క్‌రామ్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రూయిస్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, లూథో సిపమ్లా, కేశవ్ మహరాజ్, ఎన్రిక్ నార్ట్జ్, లుంగీ ఎంగ్డి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




