IND vs PAK: ప్లేయింగ్ 11ని ప్రకటించి టీమిండియాకు సవాల్ విసిరిన బాబర్ సేన.. అదే జట్టులో బరిలోకి..
Pakistan Playing XI vs IND: పాకిస్తాన్ తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించింది. భారత్‌తో జరిగే మ్యాచ్‌లో గెలుపు కూర్పులో ఎలాంటి మార్పులు చేయకూడదని పాకిస్థాన్ నిర్ణయించుకుంది. అయితే, మ్యాచ్‌కు ముందు పాక్ జట్టు ప్లేయింగ్ ఎలెవన్‌ను మార్చలేమని దీని అర్థం కాదు. నిబంధనల ప్రకారం టాస్‌కు ముందు పాక్ జట్టు ప్లేయింగ్ ఎలెవన్‌ను మార్చుకోవచ్చు. కానీ, అలా జరిగే అవకాశాలు చాలా తక్కువ.
India Vs Pakistan: సెప్టెంబరు 2న శ్రీలంకలోని కాండీలో భారత్‌తో జరిగే ఆసియా కప్ 2023 మ్యాచ్‌కు ఒక రోజు ముందు, పాకిస్థాన్ తన ప్లేయింగ్ ఎలెవన్‌ని ప్రకటించింది. ఆసియా కప్‌లో తొలి మ్యాచ్‌లో నేపాల్‌తో తలపడిన జట్టునే బరిలోకి దించాలని పాకిస్థాన్ బోర్డు నిర్ణయించింది. ఆసియా కప్ హైవోల్టేజ్ మ్యాచ్‌కు మరో రోజు మిగిలి ఉండగానే, పాకిస్థాన్ తన ప్లేయింగ్ ఎలెవన్ (Pakistan Cricket Team)ను ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. శుక్రవారం సెప్టెంబర్ 1న కెప్టెన్ బాబర్ ఆజం మీడియా సమావేశం అనంతరం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తన సోషల్ మీడియా ఖాతాలో ఈ విషయాన్ని తెలియజేసింది.
నిజానికి మ్యాచ్‌కు ఒకరోజు ముందు తమ జట్టును ప్రకటించే సంప్రదాయం పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు లేదు. అయితే, ఈ ఏడాది ఆసియాకప్‌లో పాకిస్థాన్ బోర్డు అలాంటి వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. అంతకుముందు ఆగస్టు 30న జరిగిన టోర్నీ తొలి మ్యాచ్‌కు ఒకరోజు ముందు పాకిస్థాన్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. ఆ మ్యాచ్‌లో నేపాల్ జట్టుపై పాకిస్థాన్ 238 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో పాక్ కెప్టెన్ బాబర్ ఆజం, మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ ఇఫ్తికర్ అహ్మద్ అద్భుత సెంచరీలు చేశారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ రెండు సెంచరీల సాయంతో 342 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నేపాల్ కేవలం 104 పరుగులకే షాహీన్ షా ఆఫ్రిది, హారిస్ రౌఫ్, షాదాబ్ ఖాన్ ధాటికి ఆలౌటైంది.
జట్టు మారలేదు..
భారత్‌తో జరిగే మ్యాచ్‌లో గెలుపు కూర్పులో ఎలాంటి మార్పులు చేయకూడదని పాకిస్థాన్ నిర్ణయించుకుంది. అయితే, మ్యాచ్‌కు ముందు పాక్ జట్టు ప్లేయింగ్ ఎలెవన్‌ను మార్చలేమని దీని అర్థం కాదు. నిబంధనల ప్రకారం టాస్‌కు ముందు పాక్ జట్టు ప్లేయింగ్ ఎలెవన్‌ను మార్చుకోవచ్చు. కానీ, అలా జరిగే అవకాశాలు చాలా తక్కువ.
లోటుపాట్లు ఉన్నా.. జట్టులో ఎలాంటి మార్పు లేదు..
Pakistan to field same playing XI tomorrow 🇵🇰#PAKvIND | #AsiaCup2023 pic.twitter.com/qe18Ad6pF4
— Pakistan Cricket (@TheRealPCB) September 1, 2023
అయితే, నేపాల్‌పై విజయం సాధించినప్పటికీ, కొంతమంది మాజీ పాక్ వెటరన్లు జట్టులో మార్పులు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఓపెనర్ ఫఖర్ జమాన్ జట్టులో స్థానంపై ప్రశ్నలు తలెత్తాయి. గత కొన్ని నెలలుగా పేలవమైన ఫామ్‌తో బాధపడుతున్నాడు. అలాగే నేపాల్‌పై అతని బ్యాట్ ఎలాంటి ఉపయోగం లేకుండా మారింది. అతనితో పాటు మిడిలార్డర్‌లో పెద్దగా అనుభవం లేని అఘా సల్మాన్ ఉనికిని కూడా ప్రశ్నించింది. అయినప్పటికీ నేపాల్‌పై పాకిస్థాన్ విజయం సాధించింది. అయితే పాక్ జట్టుకు అసలు పరీక్ష ఇప్పుడు భారత్‌పైనే జరగనుంది. పాక్ నిర్ణయం సరైందా కాదా అనేది శనివారమే తేలనుంది.
పాకిస్థాన్ జట్టు: ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్, సల్మాన్ అఘా, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షాహీన్ ఆఫ్రిది, హరీస్ రవూఫ్, నసీమ్ షా.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..