IND vs PAK: దాయాదుల మ్యాచ్‌కు వరుణుడి గండం.. మ్యాచ్‌ రద్దయితే రిజర్వ్‌డే ఉంటుందా? లేదా? రూల్స్‌ ఏం చెబుతున్నాయంటే?

|

Oct 22, 2022 | 9:03 AM

వర్షం కారణంగా ఆదివారం రాత్రి ఇండియా-పాక్ మ్యాచ్ రద్దయితే ఏం జరుగుతుందని చాలా మంది ఫ్యాన్స్ అడుగుతున్నారు. మ్యాచ్‌ ఆదివారం జరగకుంటే సోమవారానికి రీషెడ్యూల్‌ షేయాలని కొందరు కోరుతున్నారు.

IND vs PAK: దాయాదుల మ్యాచ్‌కు వరుణుడి గండం.. మ్యాచ్‌ రద్దయితే రిజర్వ్‌డే ఉంటుందా? లేదా? రూల్స్‌ ఏం చెబుతున్నాయంటే?
Ind Vs Pak
Follow us on

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ ఫ్యాన్స్‌ దృష్టంతా ఇప్పుడు భారత్ వర్సెస్‌ పాకిస్తాన్‌ మ్యాచ్‌పైనే ఉంది. మెల్‌బోర్న్‌ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌కు మరికొన్ని గంటలే మిగిలి ఉంది. అయితే ఈ మ్యాచ్‌కు వరుణుడి ముప్పు ఉండడంతో క్రికెట్‌ ఫ్యాన్స్‌ తీవ్ర నిరుత్సాహానికి గురువుతున్నారు. మ్యాచ్‌ జరిగే రోజు కూడా వర్షం పడుతుందన్న వార్తలతో అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వర్షం కారణంగా ఆదివారం రాత్రి ఇండియా-పాక్ మ్యాచ్ రద్దయితే ఏం జరుగుతుందని చాలా మంది ఫ్యాన్స్ అడుగుతున్నారు. మ్యాచ్‌ ఆదివారం జరగకుంటే సోమవారానికి రీషెడ్యూల్‌ షేయాలని కొందరు కోరుతున్నారు. అయితే గ్రూప్ దశలో జరిగే మ్యాచ్‌లకు ఐసీసీ రిజర్వ్ డేను ఉంచలేదు. గ్రూప్ దశల్లో జరిగే ఏ మ్యాచ్‌కి కూడా రిజర్వ్ డేలు ఉండవు. కేవలం నాకౌట్‌ మ్యాచ్‌లకు మాత్రమే రిజర్వ్‌ డేను అమలు చేస్తారు. సో.. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ వర్షార్పణం అయితే ఇరు జట్లు సమంగా పాయింట్లు పంచుకుంటాయి. అంటే రెండు చెరో పాయింట్లతో సరిపెట్టుకోవాల్సిందే.

కాగా శనివారం నుంచి ప్రపంచ కప్ సూపర్‌-12 మ్యాచ్‌లు మొదలవుతున్నాయి. ఈరోజు ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియాతో గతేడాది ఫైనలిస్టు కివీస్‌ తలపడనుంది. అయితే ఆస్ట్రేలియాలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాన్‌లానినా ఎఫెక్ట్‌ మరికొన్ని రోజులు ఉంటుందని అక్కడి వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ఆయా జట్లతో పాటు అభిమానులు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వరుణుడు కరుణిస్తేనే మ్యాచ్‌లు సాజావుగా సాగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే గబ్బాలో టీమిండియా, కివీస్ మధ్య జరగాల్సిన వార్మప్‌ మ్యాచ్‌ ఒక్క బంతి కూడా పడంకుండా రద్దైన సంగతి తెల్సిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..