IND vs NZ: మూడో టెస్టులోనూ భారత్ ఘోర పరాజయం.. క్లీన్ స్వీప్ తో చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్

|

Nov 03, 2024 | 1:34 PM

సొంత గడ్డపై భారత జట్టుకు దారుణ పరాభవం. న్యూజిలాండ్ తో వరుసగా మూడో టెస్టులోనూ టీమిండియా పరాజయం పాలైంది. ముంబై టెస్టులో రెండో ఇన్నింగ్స్ లో 147 పరుగులు ఛేదించలేక టీమిండియా ఘోర పరాజయాన్ని మూట గట్టుకుంది.

IND vs NZ: మూడో టెస్టులోనూ భారత్ ఘోర పరాజయం.. క్లీన్ స్వీప్ తో చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్
India Vs New Zealand
Follow us on

న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టెస్టులోనూ టీమిండియా పరాజయం పాలైంది. రెండో ఇన్నింగ్స్‌లో 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 121 పరుగులకే పరిమితమైంది. రిషభ్ పంత్ (64) మినహా మిగతా బ్యాటర్లందరూ చేతులెత్తేశారు. ఫలితంగా 25 పరుగుల తేడాతో భారత జట్టు ఓటమిపాలైంది. కివీస్‌ బౌలర్లలో అజాజ్‌ పటేల్‌ 6 వికెట్లు పడగొట్టగా, గ్లెన్‌ ఫిలిప్స్‌ 3 వికెట్లు తీశారు. కాగా స్వదేశంలో సుమారు 24 ఏళ్ల తర్వాత భారత జట్టు వైట్ వాష్ కు గురైంది. మూడో టెస్టులో న్యూజిలాండ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ ఊహాజనితమే కావడంతో న్యూజిలాండ్ సరిగ్గా బ్యాటింగ్ చేసింది. తొలిరోజు న్యూజిలాండ్ జట్టు మొత్తం కేవలం 235 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఈ మ్యాచ్‌లో నైనా భారత జట్టు విజయం సాధిస్తుందనే ఆశలు మరింత పెరిగాయి. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా నుంచి భారీ ఆధిక్యం వస్దుందని అభిమానులు ఆశించారు.. అయితేభారత్ తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులు చేసి కేవలం 28 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇక న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 174 పరుగులు చేసింది.

దీంతో రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా విజయానికి  146 పరుగులు అవసరమయ్యాయి.  కానీ టీమ్ ఇండియా బ్యాటింగ్ చూసి క్రీడాభిమానులు విస్తుపోయారు.   121 పరుగుల కే కుప్పకూలి 25 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకున్నారు.  ఇక రెండో ఇన్నింగ్స్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ 11 పరుగులు చేయగా, అతని ఓపెనింగ్ భాగస్వామి యశస్వి జైస్వాల్ 5 పరుగులు చేశాడు. ఇది కాకుండా, ఛేజింగ్‌ కింగ్  విరాట్ కోహ్లీ 1 పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు.  శుభ్‌మన్ గిల్, సర్ఫరాజ్ ఖాన్ కూడా ఒక్కో పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరుకున్నారు. రవీంద్ర జడేజా 6 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 12 పరుగులు, అశ్విన్ 8 పరుగులు చేసి ఔటయ్యారు. ఆకాశ్ దీప్, సిరాజ్ ఖాతా కూడా తెరవలేకపోయారు.  దీంతో టీమిండియాకు మరో ఓటమి తప్పలేదు.

ఇవి కూడా చదవండి

24 ఏళ్ల తర్వాత సొంత గడ్డపై క్లీన్ స్వీప్..

భారత్ ప్లేయింగ్ 11: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్.

న్యూజిలాండ్ ప్లేయింగ్ 11: టామ్ లాథమ్ (కెప్టెన్), డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, ఇష్ సోధి, మాట్ హెన్రీ, అజాజ్ పటేల్, విలియం ఓ రూర్క్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..