IND vs NZ, Day 4, 1st Test: వర్షంతో ఆగిన ఆట.. సెంచరీ భాగస్వామ్యంతో సర్ఫరాజ్, పంత్ దూకుడు..

|

Oct 19, 2024 | 11:21 AM

IND vs NZ, Day 4, 1st Test: ప్రస్తుతం వర్షంతో ఆట ఆగే వరకు భారత్ కేవలం 12 పరుగుల వెనుకంజలో ఉంది. భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లకు 344 పరుగులు చేసింది. సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ అజేయంగా నిలిచారు. సర్ఫరాజ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పంత్ కూడా హాఫ్ సెంచరీ చేశాడు. వీరిద్దరి మధ్య సెంచరీ భాగస్వామ్యం నెలకొంది.

IND vs NZ, Day 4, 1st Test: వర్షంతో ఆగిన ఆట.. సెంచరీ భాగస్వామ్యంతో సర్ఫరాజ్, పంత్ దూకుడు..
Ind Vs Nz 1st Test 4th Day
Follow us on

IND vs NZ, Day 4, 1st Test: బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్ జరుగుతోంది. నాలుగో రోజైన శనివారం భారత్ దూకుడు పెంచింది. అయితే, ప్రస్తుతం వర్షం కారణంగా ఆట నిలిచిపోయింది.

ప్రస్తుతం వర్షంతో ఆట ఆగే వరకు భారత్ కేవలం 12 పరుగుల వెనుకంజలో ఉంది. భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లకు 344 పరుగులు చేసింది. సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ అజేయంగా నిలిచారు. సర్ఫరాజ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పంత్ కూడా హాఫ్ సెంచరీ చేశాడు. వీరిద్దరి మధ్య సెంచరీ భాగస్వామ్యం నెలకొంది.

మూడో రోజు చివరి బంతికి విరాట్ కోహ్లీ (70 పరుగులు) ఔటయ్యాడు. 52 పరుగుల వద్ద రోహిత్ శర్మ, 35 పరుగుల వద్ద యశస్వి జైస్వాల్ ఔట్ అయ్యారు. అజాజ్ పటేల్ 2 వికెట్లు, గ్లెన్ ఫిలిప్స్ 1 వికెట్ తీశారు. కోహ్లీ, సర్ఫరాజ్ మధ్య మూడో వికెట్‌కు 136 పరుగుల భాగస్వామ్యం నెలకొంది.

న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 402 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆ జట్టు 356 పరుగుల ఆధిక్యం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో రెండో రోజు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ను 46 పరుగులకు ఆలౌట్ చేసింది. వర్షం కారణంగా తొలిరోజు ఆట జరగలేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..