
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ జట్టు భారత్ కు 252 పరుగుల లక్ష్యాన్ని అందించింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి, ముందుగా బ్యాటింగ్ చేసింది. కివీస్ జట్టు తరపున డారిల్ మిచెల్ అత్యధికంగా 63 పరుగులు చేయగా, మైఖేల్ బ్రేస్‌వెల్ 53 పరుగులతో అజేయంగా నిలిచాడు. మిచెల్ గ్లెన్ ఫిలిప్స్ (34), మైఖేల్ బ్రేస్‌వెల్‌తో కీలక భాగస్వామ్యాలను పంచుకున్నాడు. రచిన్ రవీంద్ర (37), విల్ యంగ్ (15), కేన్ విలియమ్సన్ (11) భారీ ఆరంభాన్ని అందించడంలో విఫలమయ్యారు.
ఇక భారత జట్టు తరపున వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. రవీంద్ర జడేజా, షమీ తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
రెండు జట్ల ప్లేయింగ్-11..
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ మరియు వరుణ్ చక్రవర్తి.
న్యూజిలాండ్: మిచెల్ సాంట్నర్ (కెప్టెన్) , విల్ యంగ్, రాచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, నాథన్ స్మిత్, కైల్ జామిసన్, విలియం ఓ’రూర్కే.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..