IND vs NZ 3rd T20: గౌహతి గడ్డపై భారత్‌కు గండం..హర్షిత్ రాణా అవుట్.. టీమిండియా ప్లాన్ ఇదే!

IND vs NZ 3rd T20: నేడు గౌహతి వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య మూడో టీ20 జరగనుంది. ఇప్పటికే వరుస విజయాలతో ఊపుమీదున్న టీమిండియా ఈ మ్యాచ్‌తో సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు, కనీసం ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని కివీస్ జట్టు గట్టి పట్టుదలతో ఉంది.

IND vs NZ 3rd T20: గౌహతి గడ్డపై భారత్‌కు గండం..హర్షిత్ రాణా అవుట్.. టీమిండియా ప్లాన్ ఇదే!
Ind Vs Nz 3rd T20 Today

Updated on: Jan 25, 2026 | 1:32 PM

IND vs NZ 3rd T20: నేడు గౌహతి వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య మూడో టీ20 జరగనుంది. ఇప్పటికే వరుస విజయాలతో ఊపుమీదున్న టీమిండియా ఈ మ్యాచ్‌తో సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు, కనీసం ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని కివీస్ జట్టు గట్టి పట్టుదలతో ఉంది. సాయంత్రం 6:30 గంటలకు టాస్ పడనుండగా, రాత్రి 7 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభమవుతుంది.

భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలో ఉంది. నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 238 పరుగుల భారీ స్కోరు సాధించి 48 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక రాయ్‌పూర్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో కివీస్ 208 పరుగులు చేసినప్పటికీ, టీమిండియా ఆ లక్ష్యాన్ని కేవలం 15.2 ఓవర్లలోనే ఊదేశింది. సంజూ శామ్సన్, అభిషేక్ శర్మ త్వరగా అవుట్ అయినప్పటికీ, మిగిలిన బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి విజయాన్ని అందించారు.

పిచ్ ఎలా ఉండబోతోంది?

గౌహతిలోని బార్సపరా స్టేడియం పిచ్ సాధారణంగా బ్యాటర్లకు స్వర్గధామం. బౌండరీలు చిన్నవిగా ఉండటం వల్ల ఇక్కడ భారీ స్కోర్లు నమోదవుతుంటాయి. 2023లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 222 పరుగులు చేసినా, ఆసీస్ ఆ లక్ష్యాన్ని చేజ్ చేసిందంటే ఇక్కడ బ్యాటింగ్‌కు ఎంత అనుకూలమో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈరోజు కూడా సిక్సర్ల వర్షం కురవడం ఖాయమనిపిస్తోంది. టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుని, లక్ష్యాన్ని చేజ్ చేయడానికే ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది.

జట్ల బలాబలాలు

ప్రస్తుత ఫామ్ ప్రకారం భారత్ 70 శాతం గెలిచే అవకాశాలు ఉన్నాయి. భారత టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినా మిడిల్ ఆర్డర్ బలంగా ఉండటం జట్టుకు పెద్ద ప్లస్ పాయింట్. అయితే కివీస్ జట్టును తక్కువ అంచనా వేయలేం. వారు మొదట బ్యాటింగ్ చేసి 180 కంటే తక్కువ స్కోరు చేస్తే భారత్‌కు తిరుగుండదు. కానీ గౌహతిలో కివీస్ చేజింగ్ చేస్తే మాత్రం టీమిండియాకు సవాల్ తప్పదు. తుది జట్టులో బుమ్రా, అక్షర్ పటేల్ తిరిగి వస్తే భారత బౌలింగ్ మరింత పటిష్టంగా మారుతుంది.

తుది జట్ల అంచనా

భారత తుది జట్టు: అభిషేక్ శర్మ, సంజూ శాంసన్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్ / కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా / హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.

న్యూజిలాండ్ తుది జట్టు: టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్), డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), కైల్ జామిసన్, మాట్ హెన్రీ, ఇష్ సోధీ, జాకబ్ డఫీ.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..