Video: రనౌట్ ప్రమాదంలో పంత్.. పిచ్ మధ్యలో సర్ఫరాజ్ సూపర్ స్కెచ్.. వీడియో చూస్తే సెల్యూట్ చేయాల్సిందే

|

Oct 19, 2024 | 12:35 PM

Sarfaraz Khan Dances on Pitch to Save Rishabh Pant From Run Out: ఇన్నింగ్స్ 56వ ఓవర్ తొలి బంతికి రిషబ్ పంత్ రనౌట్ అయ్యేవాడు. కాని తృటిలో తప్పించుకున్నాడు. వాస్తవానికి, సర్ఫరాజ్ మాట్ హెన్రీ వేసిన గుడ్ లెంగ్త్ బంతిని డీప్ బ్యాక్‌వర్డ్ పాయింట్ వద్ద నెట్టి సింగిల్ తీశాడు. అయితే ఫీల్డర్ వైపు చూడకుండా రెండో పరుగు కోసం వెళ్లాడు. ఇలాంటి పరిస్థితిలో సర్ఫరాజ్ అద్భుతంగా ఆలోచించి ఔట్ కాకుండా చూశాడు. ఇందులో న్యూజిలాండ్ కీపర్ కూడా చిన్న తప్పు చేయడంతో టీమిండియా ఊపిరి పీల్చుకుంది.

Video: రనౌట్ ప్రమాదంలో పంత్.. పిచ్ మధ్యలో సర్ఫరాజ్ సూపర్ స్కెచ్.. వీడియో చూస్తే సెల్యూట్ చేయాల్సిందే
Rishabh Pant Video Sarfaraz Khan Dance
Follow us on

India vs New Zealand, 1st Test: బెంగళూరులో భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు నాలుగో రోజు సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ మధ్య సెంచరీ భాగస్వామ్యంతో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం వర్షంతో మ్యాచ్ ఆగింది. ఈ క్రమంలో భారత్ ప్రస్తుతం 3 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసింది. అయితే, పరుగులు తీసే క్రమంలో వీరిద్దరి మధ్య ఓ పొరపాటు జరిగింది. ఆ తరువాత, మైదానంలో ఒక ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. దీంతో ప్రేక్షకులతోపాటు అంపైర్లు, తోటి ఆటగాళ్లు నవ్వులో మునిగిపోయారు. రెండో పరుగు తీయలేదన్న సర్ఫరాజ్‌ వాయిస్‌ని పంత్‌ వినలేదు. దీంతో మరో పరుగు కోసం ప్రయత్నించాడు. ఇటువంటి పరిస్థితిలో, సర్ఫరాజ్ పంత్‌ను రక్షించడానికి పిచ్‌పై డ్యాన్స్‌లు చేస్తూ, దూకుతూ గట్టిగా అరవడం ప్రారంభించాడు. దీంతో కన్ఫ్యూజ్ అయిన న్యూజిలాండ్ కీపర్ టామ్ బ్లండెల్‌ రనౌట్ చేసే సువర్ణావకాశం మిస్ చేసుకున్నాడు. ఈ పొరపాటుతో పంత్‌కు లైఫ్ దక్కింది. ఆ సమయంలో పంత్ కేవలం 6 పరుగుల వద్ద ఉన్నాడు.

భారత్ రెండో ఇన్నింగ్స్ 56వ ఓవర్ వేయడానికి మాట్ హెన్రీ వచ్చాడు. సర్ఫరాజ్ స్ట్రైక్‌లో ఉన్నాడు. అతను బంతిని గల్లీ వైపునకు నెట్టి పరుగు కోసం ప్రయత్నించాడు. మొదటి పరుగు త్వరగా తీసుకున్న తర్వాత, డెవాన్ కాన్వే బంతిని పట్టుకున్నాడు. ఇక రెండవ పరుగు సాధ్యం కాదని సర్ఫరాజ్ భావించాడు. ఇటువంటి పరిస్థితిలో పంత్‌ను రావొద్దని చెప్పాడు. కానీ, పంత్ ఆ మాట వినలేకపోవడంతో వేగంగా పరిగెత్తి సగం పిచ్‌కు చేరుకున్నాడు. సర్ఫరాజ్ తన గొంతు వినబడకపోవడంతో, పిచ్ మధ్యలో దూకుతూ, డ్యాన్స్ చేస్తూ బిగ్గరగా అరవడం ప్రారంభించాడు. ఇది గమనించిన పంత్‌ వెనుకకు వెళ్లాడు.

రిషబ్ పంత్ రనౌట్ కాకుండా ఎలా తప్పించుకున్నాడు?

అప్పటికే కాన్వే ఖచ్చితమైన త్రో చేసి, బంతిని కీపర్ బ్లండెల్ వైపు విసిరాడు. ఇది సరిగ్గా క్యాచ్ చేశాడు. కానీ, న్యూజిలాండ్ వైపు పొరపాటు జరిగింది. రనౌట్ అయ్యే అవకాశం ఏ విధంగా ఉందో ఎవరూ కీపర్‌కు చెప్పలేదు. దీని కారణంగా, పంత్ స్ట్రైక్ ఎండ్‌లో క్రీజు వెలుపల ఉండగా, బ్లండెల్, బంతిని పట్టుకున్న తర్వాత, నాన్-స్ట్రైక్ వైపు విసిరేందుకు ప్రయత్నించాడు. కివీస్ కీపర్ అక్కడి పరిస్థితిని అర్థం చేసుకునే సమయానికి పంత్ సురక్షితంగా క్రీజుకు చేరుకున్నాడు. దీంతో భారత్ వికెట్ కోల్పోకుండా తప్పించుకుంది. ఇదంతా చూసిన సర్ఫరాజ్‌కి కోపం వచ్చింది. పంత్ వైపు చూస్తూ గట్టిగా నా వైపు చూడు అంటూ సైగ చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..