
ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందే భారత్‌కు భారీ షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అనూహ్యంగా ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాలతో మొదటి రెండు టెస్టులకు అందుబాటులో ఉండట్లేదని కోహ్లీ సమచారం అందించాడని బీసీసీఐ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. త్వరలో కోహ్లీ స్థానంలో మరో ప్లేయర్‌ను ఎంపిక చేస్తామని బోర్డు తెలిపింది. ఇంగ్లాండ్‌తో మొదటి రెండు టెస్టులకు ఇటీవల సెలక్షన్ కమిటీ భారత జట్టును ప్రకటించింది. ఈనెల 25 నుంచి హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. టెస్టు సిరీస్‌కి విరాట్ కోహ్లీ దూరం కావడానికి వ్యక్తిగత కారణాలేనని తెలుస్తోది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. విరాట్ ప్రస్తుతం అయోధ్యలో ఉన్నాడు. అక్కడ అతను రామ మందిర ప్రారంభోత్సవంలో పాల్గొన్నాడు. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ కోసం కోహ్లీ హైదరాబాద్‌కు వచ్చాడని గతంలో వార్తలు వచ్చాయి. అంతేకాదు ఇక్కడి నుంచే అయోధ్యకు వెళ్లాడని తెలిసింది. అయితే ఇప్పుడు అనూహ్యంగా టెస్ట్ సిరీస్ నుంచి తప్పుకుని అందరికీ షాక్ ఇచ్చాడీ రన్ మెషిన్.
కాగా హైదరాబాద్ వేదికగా జరగనున్న తొలి టెస్టుకు విరాట్ కోహ్లీ దూరమయ్యాడన్న వార్త ఇంగ్లండ్‌కు ఊరటనిచ్చింది. హైదరాబాద్‌లో విరాట్ రికార్డులు బాగా ఉన్నాయి. ఇక్కడ టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్ కోహ్లీనే. విరాట్ కోహ్లి ఇప్పటి వరకు హైదరాబాద్‌లో 4 టెస్టులు ఆడాడు, అందులో 1 సెంచరీతో సహా 379 పరుగులు చేశాడు. మొత్తమ్మీద భారత గడ్డపై ఇంగ్లండ్‌తో ఇప్పటివరకు ఆడిన 13 టెస్టుల్లో విరాట్ కోహ్లీ 56.38 సగటుతో 1015 పరుగులు, 3 సెంచరీలు చేశాడు.
🚨 NEWS 🚨
Virat Kohli withdraws from first two Tests against England citing personal reasons.
Details 🔽 #TeamIndia | #INDvENGhttps://t.co/q1YfOczwWJ
— BCCI (@BCCI) January 22, 2024
Virat Kohli’s convoy in Ayodhya.
– The 🐐 has reached Ram Janmabhoomi. pic.twitter.com/HwkmAA2388
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 21, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..