IND vs ENG: ఏంటి అశ్విన్ ఇది! బ్యాటింగ్ ప్రారంభించకుండానే ఇంగ్లండ్‌కు 5 పరుగులు.. అసలు ఏమైందంటే?

|

Feb 16, 2024 | 2:26 PM

రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో భారత్ -ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 445 పరుగులకు ఆలౌటైంది. మూడో రోజు ఆటలో అరంగేట్రం ప్లేయర్‌ ధ్రువ్‌ జురైల్‌ 46 పరుగులు చేశాడు. . భారత జట్టు తరఫున ఈ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ అత్యధికంగా 135 పరుగులు చేయగా, రవీంద్ర జడేజా కూడా 112 పరుగులు చేశాడు.

IND vs ENG: ఏంటి అశ్విన్ ఇది! బ్యాటింగ్ ప్రారంభించకుండానే ఇంగ్లండ్‌కు 5 పరుగులు.. అసలు ఏమైందంటే?
India Vs England
Follow us on

రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో భారత్ -ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 445 పరుగులకు ఆలౌటైంది. మూడో రోజు ఆటలో అరంగేట్రం ప్లేయర్‌ ధ్రువ్‌ జురైల్‌ 46 పరుగులు చేశాడు. . భారత జట్టు తరఫున ఈ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ అత్యధికంగా 135 పరుగులు చేయగా, రవీంద్ర జడేజా కూడా 112 పరుగులు చేశాడు. యువ సంచలనం సర్ఫరాజ్‌ఖాన్‌ కూడా అర్ధసెంచరీతో అకట్టుకున్నాడు. ఇంగ్లండ్ తరఫున పేసర్ మార్క్ వుడ్ అత్యధికంగా 4 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటో రాజ్‌ కోట్‌ రెండో రోజు రవిచంద్రన్ అశ్విన్ పెద్ద తప్పిదం చేశాడు. అతని తప్పిదం వల్ల ఇంగ్లండ్‌ బ్యాటింగ్ ప్రారంభించకముందే ఖాతా తెరిచింది. ఇంగ్లండ్ బ్యాటింగ్ 0కి బదులుగా 5 పరుగులతో ప్రారంభమైంది. వివరాల్లోకి వెళితే.. టీమ్ ఇండియా బ్యాటింగ్ ఇన్నింగ్స్ 102వ ఓవర్లో ఆర్. అశ్విన్ పెద్ద తప్పు చేశాడు. దీంతో ఇంగ్లండ్‌కు భారత జట్టు 5 పరుగులకే వదులుకోవాల్సి వచ్చింది. 102వ ఓవర్ వేయడానికి రెహాన్ అహ్మద్ వచ్చాడు. రెహాన్ వేసిన నాలుగో బంతికి అశ్విన్ ఒక పరుగు సాధించాడు. ఈ సందర్భంగా పిచ్‌ పై డేంజర్‌ జోన్‌లో అశ్విన్ పరుగెత్తాడు. నిబంధనల ప్రకారం పిచ్‌ డేంజర్‌ జోన్‌పై పరుగులు తీయకూడదు. దీంతో పిచ్ రూపు రేఖలు మారిపోతాయి. తొలిరోజు రవీంద్ర జడేజా కూడా ఇదే తప్పిదం చేశాడు. దీంతో అంపైర్ జడేజాను హెచ్చరించాడు. ఆ తర్వాత అశ్విన్ చేసిన అదే తప్పిదంతో అంపైర్ 5 పరుగుల జరిమానా విధించాడు. దీంతో అంపైర్ జోయెల్ విల్సన్ టీమ్ ఇండియాకు 5 పెనాల్టీ పరుగులు విధించాడు. ఇప్పుడు ఇంగ్లండ్ ఖాతాలో 5 పరుగులు చేరాయి.

లా 41 ప్రకారం 2017 నుండి మేరీల్‌బోన్ క్రికెట్ క్లబ్‌కు లా 42 కింద జరిమానా టీమిండియాకు 5 పరుగుల పెనాల్టీ విధించారు. బ్యాటింగ్ చేసిన జట్టు అటువంటి తప్పుకు పాల్పడి, హెచ్చరించిన తర్వాత కొనసాగితే, ఫీల్డింగ్ జట్టుకు ఐదు పెనాల్టీ పరుగులు ఇవ్వబడతాయి. ఇది పిచ్‌పై రన్నింగ్ లేదా పిచ్‌ను దెబ్బతీసే మార్గంగా పరిగణిస్తారు. పిచ్‌పై పరుగెత్తడం లెవల్ 1 నేరం.

ఇవి కూడా చదవండి

 

గతంలోనూ…

2016లో భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన ఇండోర్ టెస్టులో రవీంద్ర జడేజా తప్పిదం వల్ల కివీస్ 5 పరుగులు పొందింది.. ఈ మ్యాచ్‌లో భారత్ తన ఇన్నింగ్స్‌ను 557/5 వద్ద డిక్లేర్ చేయడంతో, న్యూజిలాండ్ 5/0 వద్ద తన ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. అంతిమంగా, అశ్విన్ 13 వికెట్లు పడగొట్టడంతో ఆ టెస్టులో భారత్ 321 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆతిథ్య జట్టు 3-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది.

ఆకట్టుకున్న ధ్రువ్ జురేల్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..