IND vs ENG 3rd ODI: దుమ్మురేపిన టీమిండియా ఆటగాళ్లు.. ఇంగ్లాండ్ టార్గెట్ 330 పరుగులు..
ఇంగ్లాండ్‌తో చావో రేవో తేల్చుకోవల్సిన మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు దూకుడుగా ఆడారు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన టీిమిండియా..
ఇంగ్లాండ్‌తో చావో రేవో తేల్చుకోవల్సిన మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు దూకుడుగా ఆడారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన టీిమిండియా 48.2 ఓవర్లలో 329 పరుగులకే ఆలౌటైంది. శిఖర్ ధావన్(67/56 బంతుల్లో 10ఫోర్లు), రిషబ్ పంత్(78/ 62 బంతుల్లో 5ఫోర్లు,4సిక్సర్లు), హార్దిక్ పాండ్య(64/ 44బంతుల్లో 5ఫోర్లు, 4సిక్సర్లు) సూపర్ ఆటతీరుతో విరుచుకు పడ్డడారు. ఆరంభంలో రోహిత్ శర్మ(37), ఆఖర్లో శార్దుల్ ఠాకూర్(30) కీలక ఇన్నింగ్స్ ఇంగ్లాండ్ ముందు భారీ స్కోర్ పెట్టగలిగారు. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్‌వుడ్ మూడు వికెట్లు తీయగా..అదిల్ రసీద్ గూగ్లీలతో రెండు వికెట్లు తీశాడు.
అయితే టీమిండియాకు రోహిత్-ధావన్ శుభారంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్‌కు 103 పరుగుల భాగస్వామ్యం అందించారు. చరిత్రలో ఓ రికార్డ్ భాగస్వమ్యంను నెలకొల్పారు. స్వల్ప వ్యవధిలోనే రోహిత్, ధావన్, కోహ్లీ(7) పెవిలియన్ దారి పట్టారు.
అయితే ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన పంత్ తుఫాన్‌లాంటి ఆటతో ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కులు చూపించాడు. 157/4తో ఇబ్బందుల్లో పడిన జట్టును పంత్, హార్దిక్ క్రీజులో నిలిచి ఇన్నింగ్స్‌ను పరుగులు పెట్టించారు. వీరిద్దరూ 100 పరుగుల భాగస్వామ్యం అందించారు. అర్ధశతకం సాధించిన తర్వాత పంత్ గేర్ మార్చాడు. సెంచరీ దిశగా సాగుతున్న పంత్ జోరుకు 36వ ఓవర్‌లో శామ్ కరన్ రూపంలో బ్రేక్ పడింది.
ఆ తర్వాత హార్దిక్ వేగంగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. 39వ ఓవర్లో స్టోక్స్ బౌలింగ్‌లో హార్దిక్ ఔటవడంతో.. అప్పటికే జట్టు మంచి స్కోరుకు చేరుకుంది. చివర్లో కృనాల్ పాండ్య(25), శార్దుల్ ఠాకూర్(30) వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలతో స్కోరు బోర్డును 300 దాటించారు. ఈ జోడీ 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. కృనాల్ ఔటైన తర్వాత టీమిండియా ఇన్నింగ్స్ ముగియడానికి ఎంతో సమయం పట్టలేదు. ఒకే ఓవర్‌లో ఒకే ఓవర్‌లో మార్క్‌వుడ్ రెండు వికెట్లు పడేశాడు. తొలుత రెండో బంతికి కృనాల్ పాండ్య(25) భారీ షాట్ ఆడగా జేసన్ రాయ్ అద్భుత క్యాచ్ పట్టుకున్నాడు. తర్వాత చివరి బంతికి ప్రసిద్ధ్ కృష్ణ(0) బౌల్డ్‌య్యాడు. క్రీజులో భువనేశ్వర్(3) ఉన్నాడు.