Ind vs Eng : రవీంద్ర జడేజా సెంచరీ మిస్.. శుభ్‌మన్ గిల్ సూపర్ ఇన్నింగ్స్.. భారీ స్కోరు దిశగా భారత్
ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో టీం ఇండియా ప్లేయర్లు అదరగొడుతున్నారు. ఈ క్రమంలోనే రవీంద్ర జడేజా సెంచరీ మిస్ చేసుకున్నాడు కానీ శుభ్‌మన్ గిల్‌తో కలిసి భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. గిల్ తన 150 పరుగుల మార్కును దాటి దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం భారత్ పటిష్ట స్థితిలో ఉంది.

Ind vs Eng : ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో టీం ఇండియా బ్యాట్స్ మెన్ అదరగొడుతున్నారు. రెండో టెస్ట్ మ్యాచ్ రెండో రోజు లంచ్ బ్రేక్ ముందు రవీంద్ర జడేజా సెంచరీ మిస్ చేసుకున్నాడు. జోష్ టంగ్ వేసిన ఒక మెరుపు బౌన్సర్‌కు అవుట్ అయి, మూడు అంకెల మార్కును అందుకోలేకపోతున్నాడు. జడేజా తన కెరీర్‌లో ఐదో టెస్ట్ సెంచరీకి చేరువలో కనిపించాడు.. కానీ టంగ్ చేతిలో బలయ్యాడు. దీంతో టీంఇండియా ఆరో వికెట్‌కు 203 పరుగుల పార్టనర్ షిప్ కు బ్రేక్ పడినట్లు అయింది. అయితే, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాత్రం కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడుతూ ఉదయం సెషన్‌లోనే 150 పరుగుల మార్కును దాటాడు. భారత్ ఓవర్‌నైట్ స్కోర్‌కు 109 పరుగులు జోడించి, లంచ్ సమయానికి 6 వికెట్ల నష్టానికి 419 పరుగులు చేసింది.
జడేజా 11 పరుగుల తేడాతో సెంచరీని కోల్పోయాడు. ఇది గనకు సాధించి ఉంటే అతని కెరీర్‌లో అత్యుత్తమ సెంచరీలలో ఒకటిగా నిలిచేది. ఈ లెఫ్ట్ హ్యాండ్ ఆల్‌రౌండర్ తన 137 బంతుల ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. ఎడ్జ్‌బాస్టన్‌లో రెండోసారి జడేజా ఆరో వికెట్ లేదా అంతకంటే తక్కువ వికెట్‌కు 200 ప్లస్ పార్టనర్ షిప్ లో భాగం అయ్యాడు. 2022లో ఇదే వేదికపై రిషబ్ పంత్‌తో కలిసి 222 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
ఇదిలా ఉండగా, గిల్ మొదటి రోజు ఎక్కడ ఆపేశాడో అక్కడి నుంచే ఆటను కొనసాగించి టెస్టుల్లో మొదటిసారిగా 150 పరుగుల మార్కును దాటాడు. ఇంగ్లీష్ బౌలర్ల చేత పెద్దగా ఇబ్బంది పడకుండా, గిల్ తన తొలి డబుల్ సెంచరీ వైపు దూసుకుపోతున్నాడు. లంచ్ విరామం నాటికి 288 బంతుల్లో 18 ఫోర్లు, ఒక సిక్స్‌తో 163 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. గిల్ ఇన్నింగ్స్‌లో స్టైలిష్, క్లాసీ షాట్లు ఉన్నాయి. స్పిన్నర్ షోయబ్ బషీర్‌పై రివర్స్ స్వీప్ వంటి షాట్లు ఆడటానికి కూడా శుభమాన్ గిల్ వెనుకాడలేదు.
ఈ సెషన్ చివర్లో భారత కెప్టెన్‌తో వాషింగ్టన్ సుందర్ జత కలిశాడు. భారత్ ఇప్పుడు రెండో సెషన్‌లో పైచేయి సాధించాలని టార్గెట్ గా పెట్టుకుంది. మొదటి టెస్ట్‌లో చేసిన తప్పులను మళ్లీ రిపీట్ చేయకూడదని భావిస్తోంది. రెండు ఇన్నింగ్స్‌లలోనూ లోయర్ ఆర్డర్ దారుణంగా కుప్పకూలిపోవడం వల్ల ఇంగ్లండ్ తిరిగి పుంజుకుంది. ఇప్పుడు అదే తప్పు జరగకుండా భారత్ జాగ్రత్త పడాలి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..