
Ravindra Jadeja, ICC World Cup 2023: టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) తన అద్భుతమైన ఫీల్డింగ్‌తో మరోసారి వార్తల్లో నిలిచాడు. పూణెలో జరుగుతున్న మ్యాచ్ (India vs Bangladesh)లో జడేజా చిరుతపులిలా ఎగిరి ముష్ఫికర్ రహీమ్ (Mushfiqur Rahim) ఇన్నింగ్స్‌ను ముగించాడు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 43వ ఓవర్ వేయడానికి జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) వచ్చాడు. ఈ సమయంలో 38 పరుగులు చేసి బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌కు మద్దతుగా నిలిచిన ముష్ఫికర్ రహీమ్ (38) వికెట్ తీశాడు.
మహ్మదుల్లాతో కలిసి మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పిన ముష్ఫికర్ హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు. ఈ సమయంలో, బుమ్రా వేసిన 43వ ఓవర్‌లో, రవీంద్ర జడేజా నిలబడి ఉన్న బ్యాక్‌వర్డ్ పాయింట్ వైపు ముష్ఫికర్ షాట్ ఆడాడు. వెంటనే జడేజా తన కుడివైపు అద్భుతంగా డైవ్ చేసి క్యాచ్ పట్టగలిగాడు. దీంతో బంగ్లాదేశ్ జట్టు 6వ వికెట్ పడితే భారత్ కు స్టార్ ప్లేయర్ వికెట్ దక్కింది. ఈ క్రమంలో ఫీల్డింగ్ కోచ్ వైపు చూసి మెడల్ నాకు ఇవ్వాల్సిందే అంటూ సైగ చేశాడు.
Jadeja- The Fielder is beast🔥#indiavsbangladesh #CWC23 pic.twitter.com/uvlErrBeqG
— Zee (@mjzee921) October 19, 2023
ప్రపంచంలోని అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకరిగా పేరుగాంచిన జడేజా మైదానంలో ఇలాంటి విన్యాసాలు చేయడం చాలాసార్లు చూశాం. ఈసారి జడేజా ముష్ఫికర్ క్యాచ్ పట్టిన వెంటనే భారత జట్టు ఫీల్డింగ్ కోచ్ దిలీప్‌తోపాటు అంపైర్ మరైస్ ఎరాస్మస్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వీరిద్దరి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇందులో అంపైర్ ఎరాస్మస్ పతకాన్ని ప్రదానం చేయమని భారత ఫీల్డింగ్ కోచ్‌కి సైగ చేయడం చూడవచ్చు.
ఈ ప్రపంచకప్‌లో ప్రతి మ్యాచ్ తర్వాత, భారత జట్టు మేనేజ్‌మెంట్ తమ అత్యుత్తమ ఫీల్డర్‌లకు బహుమతి ఇవ్వాలని ప్లాన్ చేసింది. దీని ప్రకారం, గత మ్యాచ్‌లలో అద్భుత ఫీల్డింగ్‌ను ప్రదర్శించిన భారత జట్టు ఆటగాళ్లను డ్రెస్సింగ్ రూమ్‌లో ఈ పతకంతో సత్కరిస్తున్నారు. గతంలో విరాట్ కోహ్లీ, శార్దూల్ ఠాకూర్, కేఎల్ రాహుల్‌లకు ఈ పతకం లభించింది.
ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 256 పరుగులు చేసింది. బంగ్లాదేశ్‌లో ఓపెనర్లు తాంజిద్ అసన్ (51), లిటన్ దాస్ (66) అర్ధశతకాలు సాధించగా, మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ మహ్మదుల్లా 36 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 46 పరుగులు చేశాడు.
ప్రస్తుతం ఛేజింగ్ చేస్తోన్న టీమిండియా ప్రస్తుతం 25 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్లు కోల్పోయి 161 పరుగులు సాధించింది. రోహిత్ 48 పరుగులు చేసి పెవిలియ్ చేరగా, గిల్ 53 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. కోహ్లీ 42 పరుగులు, శ్రేయాస్ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..