IND vs BAN: ఒక బంతికి 14 పరుగులు.. బంగ్లాదేశ్ బౌలర్‌ను చితకబాదిన కింగ్ కోహ్లీ.. ఎలాగో తెలుసా?

Virat Kohli 14 Runs in 1 Ball: భారత ఇన్నింగ్స్‌లో 13వ ఓవర్‌లో బౌలర్‌ క్రమశిక్షణా రాహిత్యాన్ని కోహ్లీ సద్వినియోగం చేసుకున్నాడు. దీంతో ఒక్క బంతికే భారీగా పరుగులు రాబట్టాడు. ఆ బ్యాడ్ లక్ బంగ్లా బౌలర్ ఎవరనే కదా ఆలోచించేది.. ఆయన పేరు హసన్ మహమూద్‌. అసలు ఒక్క బంతికి 14 పరుగులు ఎలా వచ్చాయనే కదా మీ ప్రశ్న.. ఆ సంగతి ఏంటో ఇప్పుడు చూద్దాం..

IND vs BAN: ఒక బంతికి 14 పరుగులు.. బంగ్లాదేశ్ బౌలర్‌ను చితకబాదిన కింగ్ కోహ్లీ.. ఎలాగో తెలుసా?
Virat Kohli

Updated on: Oct 19, 2023 | 9:09 PM

IND vs BAN: ప్రపంచకప్‌లో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. గురువారం బంగ్లాదేశ్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో కోహ్లీ ఒక్క బంతికి 14 పరుగులు రాబట్టాడు. భారత ఇన్నింగ్స్‌లో 13వ ఓవర్‌లో బౌలర్‌ క్రమశిక్షణా రాహిత్యాన్ని కోహ్లీ సద్వినియోగం చేసుకున్నాడు. దీంతో ఒక్క బంతికే భారీగా పరుగులు రాబట్టాడు. ఆ బ్యాడ్ లక్ బంగ్లా బౌలర్ ఎవరనే కదా ఆలోచించేది.. ఆయన పేరు హసన్ మహమూద్‌. అసలు ఒక్క బంతికి 14 పరుగులు ఎలా వచ్చాయనే కదా మీ ప్రశ్న.. ఆ సంగతి ఏంటో ఇప్పుడు చూద్దాం..

భారత కెప్టెన్ రోహిత్ శర్మ అవుట్ అయిన తర్వాత, కోహ్లీ బ్యాటింగ్‌కు వచ్చాడు. మొదటి బంతికి రెండు పరుగులు చేశాడు. అయితే, అంపైర్ దానిని నో-బాల్ అని ప్రకటించాడు. దీంతో ఈ ఫ్రీ-హిట్ బంతిని మిడ్-ఆన్‌ మీదుగా ఫోర్ కొట్టిన విరాట్ కోహ్లీ.. సెట్ అవ్వడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు. అయితే, దురదృష్టవశాత్తు ఈ బాల్ కూడా నో-బాల్ అయింది. దీంతో కోహ్లీకి మరొక ఫ్రీ-హిట్ లభించింది. ఈసారి లాంగ్-ఆన్ ఫీల్డర్‌ మీదుగా సిక్సర్‌గా మలిచాడు.

ఇవి కూడా చదవండి

తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 257 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ తరపున లిటన్ దాస్ 66 పరుగులలో చక్కని ఇన్నింగ్స్ ఆడాడు. మరో ఓపెనర్ తంజిద్ అహమ్ 51 పరుగులు చేయగా, చివరికి మహ్మదుల్లా 36 బంతుల్లో 46 పరుగులతో కీలక సహకారం అందించాడు.

ఇక బౌలింగ్‌లో టీమిండియాకు రవీంద్ర జడేజా అత్యుత్తమంగా బౌలింగ్ చేశాడు. 10 ఓవర్లలో 38 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. బుమ్రా 2 వికెట్లు, సిరాజ్ 2 వికెట్లు, కుల్దీప్-శార్దూల్ తలో వికెట్ రాబట్టారు.

ఛేజింగ్‌లో టీమిండియా..

257 పరుగులతో ఛేజింగ్ మొదలు పెట్టిన టీమిండియా.. ప్రస్తుతం 35 ఓవర్లు ముగిసే సరికి 206 పరుగులు సాధించింది. రోహిత్ 48, గిల్ 53, శ్రేయాస్ 19 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. కోహ్లీ 66, రాహుల్ 17 పరుగులతో క్రీజులో నిలిచారు. టీమిండియా విజయం సాధించాలంటే 90 బంతుల్లో 51 పరుగులు చేయాల్సి ఉంది.