IND vs BAN: ఉప్పల్‌లో సంజూ శామ్సన్ ఊచకోత.. 40 బంతుల్లోనే మెరుపు సెంచరీ

|

Oct 12, 2024 | 8:57 PM

చాలా రోజుల తర్వాత సంజూ శామ్సన్ అదరగొట్టాడు. గత కొన్ని రోజులుగా పేలవమైన ఆటతీరుతో విమర్శలు ఎదుర్కొంటోన్న ఈ యంగ్ ప్లేయర్ బంగ్లాదేశ్ తో జరుగుతోన్న ఆఖరి టీ20 మ్యాచ్ లో మెరుపు సెంచరీ సాధించాడు. హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్ లో ఓపెనర్ గా వచ్చిన ఈ యంగ్ ప్లేయర్ ఆరంభం నుంచే బంగ్లా బౌలర్లపై విరుచుకు పడ్డాడు

IND vs BAN: ఉప్పల్‌లో సంజూ శామ్సన్ ఊచకోత.. 40 బంతుల్లోనే మెరుపు సెంచరీ
Sanju Samson
Follow us on

చాలా రోజుల తర్వాత సంజూ శామ్సన్ అదరగొట్టాడు. గత కొన్ని రోజులుగా పేలవమైన ఆటతీరుతో విమర్శలు ఎదుర్కొంటోన్న ఈ యంగ్ ప్లేయర్ బంగ్లాదేశ్ తో జరుగుతోన్న ఆఖరి టీ20 మ్యాచ్ లో మెరుపు సెంచరీ సాధించాడు. హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్ లో ఓపెనర్ గా వచ్చిన ఈ యంగ్ ప్లేయర్ ఆరంభం నుంచే బంగ్లా బౌలర్లపై విరుచుకు పడ్డాడు. మైదానం నలువైపులా ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. కేవలం 40 బంతుల్లోనే మెరుపు సెంచరీ సాధించి విమర్శకుల నోళ్లు మూయించాడు. సంజూ మెరుపు ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు, 8 సిక్సర్లు ఉండడం విశేషం. ఓవరాల్ గా 47 బంతుల్లో 111 పరుగులు చేసిన శాంసన్ 13 ఓవర్ లో ఔటయ్యాడు. అతనికి తోడు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కూడా మెరుపు అర్ధ సెంచరీ సాధించాడు. 32 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 67 పరుగులతో ఇంకా క్రీజులో ఉన్నాడు. వీరిద్దరూ కేవలం 69 బంతుల్లోనే 172 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 14 ఓవర్లలో 201/2. ప్రస్తుతం టీమిండియా బ్యాటర్ల జోరు చూస్తుంటే అంతర్జాతీయ టీ20ల్లో భారీ స్కోరు రికార్డు బద్దలయ్యే అవకాశముంది.

ఒకే ఓవర్ లో 5 సిక్స్ లు..

కాగా ఈ  మ్యాచ్ లో బంగ్లాదేశ్‌కు చెందిన రిషద్ హొస్సేన్‌కు పట్ట పగలే చుక్కలు చూపించాడు సంజూ శామ్సన్.  రిషద్ వేసిన ఓకే ఓవర్ లో ఏకంగా 5 సిక్స్ లు కొట్టాడీ యంగ్ క్రికెటర్. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట బాగా వైరలవుతోంది.

ఇవి కూడా చదవండి

 

 

 

ఉప్పల్ లో బౌండరీల వర్షం..

 

టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్:

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డి, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్.

బంగ్లాదేశ్ ప్లేయింగ్ ఎలెవన్:

నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), పర్వేజ్ హొస్సేన్ ఇమాన్, లిటన్ దాస్ (వికెట్ కీపర్), తాంజిద్ హసన్, తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, మహేదీ హసన్, తస్కిన్ అహ్మద్, రిషద్ హొస్సేన్, ముస్తాఫిజుర్ రహ్మాన్,  తన్జిమ్.

సంజూ శామ్సన్ సెంచరీ అభివాదం..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..