బంగ్లాదేశ్ చేతిలో ఇప్పటికే వన్డే సిరీస్‌ను కోల్పోయిన టీమిండియాకు ఇప్పుడు వైట్‌వాష్ ముప్పు పొంచి ఉంది. శనివారం ఈ రెండు జట్ల మధ్య ఆఖరి వన్డే జరగనుంది. మరోవైపు భారత జట్టును గాయలబెడద బాధిస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్‌రౌండర్ దీపక్ చాహర్, పేసర్ కుల్దీప్ సేన్ మూడో మ్యాచ్‌కు దూరమయ్యారు. దీంతో చివరి మ్యాచ్‌కు ముందు కుల్దీప్ యాదవ్ తిరిగి జట్టులోకి వచ్చాడు . కాగా రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ బొటనవేలికి గాయమైంది. దీంతో వెంటనే అతనిని ఆస్పత్రికి తరలించారు. రెండో వన్డేలో బ్యాటింగ్‌కు దిగినా ముందు జాగ్రత్తగా చివరి వన్డేకు కూడా హిట్‌మ్యాన్ దూరమయ్యాడు. దీంతో సమయం వృథా చేయకుండా ముంబైకి వెళ్లిపోయాడు. అయితే బంగ్లాదేశ్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో రోహిత్ ఆడతాడా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు. రోహిత్‌తో పాటు, ఫాస్ట్ బౌలర్ కుల్దీప్ సేన్ కూడా మొదటి వన్డే తర్వాత ఫిట్‌నెస్ సమస్యలను ఎదుర్కొంటున్నాడు. ఇక రెండో వన్డేలో దీపక్ చాహర్ కూడా గాయపడటంతో సిరీస్ నుంచి తప్పుకున్నాడు. కుల్దీప్, చాహర్ ఇద్దరూ ఇప్పుడు ఎన్‌సీఏకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
కాగా బంగ్లాతో ఆఖరి మ్యాచ్ శనివారం జరగనుంది. ఇప్పటికే సిరీస్ కోల్పోయి విమర్శలు ఎదుర్కొంటోన్న టీమిండియా ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని భావిస్తోంది. అదే సయమంలో బంగ్లా మరింత ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. టీమిండియాను క్లీన్‌స్వీస్ చేయాలని పట్టుదలతో ఉంది. కాగా ఆఖరి వన్డేకోసం సెలక్షన్ కమిటీ కుల్దీప్ యాదవ్‌ను జట్టులోకి తీసుకుంది. రోహిత్ గైర్హాజరీలో కేఎల్ రాహుల్ మూడో వన్డేలో భారత జట్టు పగ్గాలు చేపట్టనున్నాడు. కాగా ఈ ఏడాది అక్టోబర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో కుల్దీప్ చివరిసారిగా భారత్ తరఫున ఆడాడు. ఢిల్లీలో జరిగిన ఈ మ్యాచ్‌లో అతను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం18 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడీ చైనామన్ బౌలర్.
కేఎల్ రాహుల్ (కేఎల్ రాహుల్ అండ్ వికెట్ కీపర్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, శ్రేయాస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్, షాబాజ్ అహ్మద్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ యాదవ్
? NEWS ?: Kuldeep Yadav added to #TeamIndia squad for the final ODI against Bangladesh. #BANvIND
Other Updates & More Details ?https://t.co/8gl4hcWqt7
— BCCI (@BCCI) December 9, 2022
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..