మిర్పూర్ వేదికగా జరుగుతున్న భారత్-బంగ్లాదేశ్ మొదటి వన్డేలో బంగ్లాదేశ్ స్టాండింగ్ కెప్టెన్ లిటన్ దాస్ మ్యాచ్ అద్భుతమైన క్యాచ్‌తో అందరి ప్రశంసలు అందుకున్నాడు. టీమిండియా ఇన్నింగ్స్ 11 ఓవర్‌లో బంగ్లా ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ బౌలింగ్‌లో మూడో బంతిని మన రన్‌మెషిన్ విరాట్ కోహ్లీ కవర్ డ్రైవ్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. కోహ్లీ షాట్ సెలెక్షన్ సూపర్బ్‌గా ఉంది. అందులో వంక పెట్టేందుకు ఏమీ లేదు. కానీ కవర్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న లిటన్ దాస్ అద్భుతంగా డైవ్ చేస్తూ ఒంటిచేత్తో క్యాచ్ అందుకున్నాడు. కోహ్లీ కూడా ఇది ఊహించలేకపోయాడు. లిటన్ దాస్ క్యాచ్‌కు ఒక్కసారిగా షాక్ తిన్నాడు. ఈ మ్యాచ్‌లో 15 బంతులు ఎదుర్కొన్న కోహ్లి కేవలం 9 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. ఈ క్రమంలో లిటన్ దాస్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా లిటన్ దాస్ పట్టిన ఈ క్యాచ్ చూసి రోహిత్ శర్మ కూడా ఆశ్చర్యపోయాడు. అలాగే బంగ్లాదేశ్‌పై అద్భుతమైన రికార్డులున్న కోహ్లీ వికెట్‌తో ఆ జట్టు ఆటగాళ్ల సంబరాలు కూడా మిన్నంటాయి. ఇక ఈ మ్యాచ్‌లో ఎప్పటిలాగే నిలకడగా బ్యాటింగ్ ప్రారంభించిన కోహ్లి.. రోహిత్‌తో కలిసి చక్కటి ఇన్నింగ్స్‌ను నిర్మించాలని సూచించాడు. కానీ షకీబ్ వీరిద్దరినీ ఒకే ఓవర్లో పెవిలియన్‌కు పంపించాడు. 11 ఓవర్ రెండో బంతికి కెప్టెన్ రోహిత్ బౌల్డ్ అయ్యాడు. 4వ బంతికి విరాట్ కోహ్లి అద్భుత ఫీల్డింగ్‌కు బలయ్యాడు. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 41.1 ఓవర్లలో 186 పరుగులకే ఆలౌటైంది. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ 73 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బంగ్లాదేశ్ తరఫున షకీబ్ తన 10 ఓవర్లలో 36 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు ఇబాదత్ హుస్సేన్ 8.2 ఓవర్లలో 47 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు.
What a catch by Liton Das ???? But excluded from CAA.#INDvsBAN #indvsbang pic.twitter.com/JsGPoGAfgj
— Dev (@iDev__R) December 4, 2022
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..