ఐదు మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్ లో భాగంగా సిడ్నీ వేదికగా జరుగుతోన్న ఆఖరి టెస్ట్ మ్యాచ్ లో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ఇప్పటికే ఇరు జట్లు తొలి ఇన్నింగ్స్‌ను ముగించగా, టీమిండియా కేవలం 4 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. దీంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. మరోవైపు బుమ్రా ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు ఆస్ట్రేలియా అభిమానులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఈ సిరీస్ మొత్తంలో ఆసీస్ ఆటగాళ్లకు పీడకలగా మారిన బుమ్రాపై లేని పోని ఆరోపణలు చేస్తున్నారు. బుమ్రా తన షూస్ లో శాండ్ పేపర్ పెట్టుకున్నాడని, తద్వారా బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడ్డాడంటూ సోషల్ మీడియాలో ఓ వీడియోను వైరల్ చేస్తున్నారు.
వాస్తవానికి, సోషల్ మీడియాలో ఆసీస్ అభిమానులు వైరల్ చేస్తోన్న ఈ వీడియోలో, జస్ప్రీత్ బుమ్రా తన షూస్ తీసి మళ్లీ ధరించారు. ఈ సమయంలో బుమ్రా షూలోంచి ఏదో కిందపడింది. దీన్ని చూసిన ఆసీస్ అభిమానులు శాండ్‌పేపర్ (బంతి ఆకృతిని మార్చేందుకు ఉపయోగిస్తారు) అని పిలుస్తున్నారు. తద్వారా బుమ్రాను మానసికంగా దెబ్బ తీయాలని చూస్తున్నారు. అయితే ఇందులో ఏ మాత్రం నిజం లేదని టీమిండియా అభిమానులు కొట్టి పారేస్తున్నారు.
Is That A Sandpaper 👀😳#INDvsAUS #INDvAUS #AUSvsIND #AUSvIND #Bumrah
— Navyanth 💲 (@Navyanth_17) January 4, 2025
బుమ్రా షూ నుంచి బయట పడింది శాండ్ పేపర్ కాదని, అది ఫింగర్ క్యాప్ అని భారత అభిమానులు ఆసీస్ ఫ్యాన్స్ కు కౌంటర్లు ఇస్తున్నారు. గాయల నుంచి చేతి వేళ్లను రక్షించుకోవడానికి బౌలర్లు తరచుగా దీనిని ధరిస్తారు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో కూడా బుమ్రా అదే చేశాడు. బౌలింగ్ తర్వాత ఫీల్డింగ్‌కు వెళుతున్నప్పుడు బుమ్రా తన షూ నుంచి ఈ ఫింగర్ క్యాప్‌ను తొలగించాడు. అయితే దీన్ని సాకుగా వాడుకున్న ఆస్ట్రేలియా అభిమానులు బుమ్రా శాండ్ పేపర్ ను ఉపయోగించి బాల్ ట్యాంపరింగ్ చేశాడని, తద్వారా సులభంగా వికెట్లు పడగొట్టారని ఆరోపిస్తున్నారు.
🚨 BUMRAH LEAVES FOR SCANS. 🚨
– Fingers are crossed…!!! 🤞pic.twitter.com/HAdB2tudiX
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 4, 2025
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి