ఇంగ్లండ్‌లోని ఓవల్‌లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా వరుసగా రెండోసారి ఆఖరి మ్యాచ్‌లో ఓడిపోయింది.
209 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. 444 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు చివరి రోజు తొలి సెషన్‌లో 234 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో ఏ భారతీయ బ్యాట్స్‌మెన్ కూడా 50+ పరుగులు చేయలేదు. విరాట్ కోహ్లీ (49 పరుగులు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
విరాట్ కోహ్లి పిచ్‌పై సెట్ అయ్యాడు. పెద్ద నాక్ కోసం చూస్తున్నాడు. అయితే స్టీవ్ స్మిత్ స్లిప్స్‌లో గాలిలోకి దూసుకెళ్లి విరాట్ అందించిన క్యాచ్ అందుకుని, మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. 47వ ఓవర్లో స్కాట్ బోలాండ్ వేసిన మూడో బంతికి విరాట్ కవర్ డ్రైవ్ కొట్టేందుకు ప్రయత్నించాడు. అయితే, బంతి బ్యాట్ అంచుకు తగిలి సెకండ్ స్లిప్‌కు వెళ్లింది.
అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న స్మిత్ గాలిలో దూకి కోహ్లీకి క్యాచ్ ఇచ్చాడు. విరాట్ 78 బంతుల్లో 49 పరుగులు చేశాడు. అద్భుతంగా క్యాచ్ పట్టి, 5వ రోజు టీమిండియా పతనానికి నాంది పలికాడు. దీంతో ఈ వీడియో తెగ వైరలవుతోంది. స్పైడర్ మ్యాన్‌లా గాల్లోకి దూకి అద్భుతమైన క్యాచ్ పట్టాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..