
India WTC Final Scenario: శ్రీలంకపై దక్షిణాఫ్రికా 2-0తో విజయం సాధించడం, అడిలైడ్‌లో ఆస్ట్రేలియాపై ఘోర పరాజయం తర్వాత టీమిండియా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరుకోవడం కష్టంగా మారింది. తాజాగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో టీమిండియా మూడో స్థానానికి పడిపోయింది. అదే సమయంలో ఆదివారం విజయంతో నంబర్ 1 స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా జట్టు 24 గంటల తర్వాత తన స్థానాన్ని కోల్పోయి రెండో స్థానానికి పడిపోయింది. దక్షిణాఫ్రికా విజయం తర్వాత ఇదంతా జరిగింది. అయితే, ఇక్కడ విశేషం ఏమిటంటే టీమిండియా ఇప్పటికీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరుకోవడానికి ఓ దారి ఉంది. అందుకోసం టీమిండియా ఏం చేయాలో ఓసారి చూద్దాం..
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా ఫైనల్‌కు చేరుకోవాలంటే.. ఆస్ట్రేలియా చేతిలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఉండడమే సులువైన మార్గం. ప్రస్తుతం టెస్టు సిరీస్ 1-1తో సమంగా ఉంది. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా 4-1తో గెలిస్తేనే టీమిండియా ఫైనల్స్‌కు చేరుకుంటుంది. ఇదొక్కటే కాదు, టీమిండియా 3-1 తేడాతో గెలిచినా, నేరుగా ఫైనల్‌లోకి ప్రవేశిస్తుంది.
టెస్టు సిరీస్‌ను 3-2తో టీమిండియా కైవసం చేసుకున్నప్పుడే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కి చేరడం సంక్లిష్టమవుతుంది. ఎందుకంటే ఈ తేడాతో సిరీస్ గెలిస్తే టీమిండియా ఫైనల్ చేరాలంటే శ్రీలంకపైనే ఆధారపడాల్సి ఉంటుంది. శ్రీలంక జట్టు ఆస్ట్రేలియాను 1-0తో ఓడించినట్లయితేనే టీమిండియా ఫైనల్స్‌కు చేరుకోగలదు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 2-2తో డ్రా చేసుకుంటే.. శ్రీలంక జట్టు ఆస్ట్రేలియాను 2-0తో ఓడించాలని టీమిండియా ప్రార్థించాల్సి ఉంటుంది. మరోవైపు, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా 2-3 తేడాతో ఓడిపోతే, పాకిస్థాన్-దక్షిణాఫ్రికా మధ్య సిరీస్‌ను 1-1తో డ్రా చేసుకోవడంతోపాటు శ్రీలంకపై ఆస్ట్రేలియా 2-0తో విజయం సాధించడం కోసం టీమిండియా ప్రార్థన చేయాల్సి ఉంటుంది. మరి ఫైనల్స్‌కు చేరేందుకు టీమిండియా ఏ మార్గాన్ని ఎంచుకుంటుందో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..